‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాణీ..’ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde), ఇంకోసారి రామ్‌చరణ్ సరసన కన్పించబోతోందా.? (Pooja Hegde To Romance Ram Charan) అంటే అవుననే చెప్పాలేమో.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘ఆచార్య’ (Acharya) సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నాడు. అది అతిథి పాత్ర కాదనీ, సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందనీ దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదిలా వుంటే, ఈ సినిమాలో రామ్‌చరణ్ (Ramcharan) సరసన హీరోయిన్ని ఎంపిక చేసే విషయమై కసరత్తులు చాలాకాలంగా జరుగుతున్నాయి. తొలుత రష్మిక మండన్న(Rashmika Mandanna) పేరు విన్పించింది. ‘వినయ విధేయ రామ’ ఫేం కైరా అద్వానీ (Kiara Advani) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
అయితే, అనూహ్యంగా ఇప్పుడు పూజా హెగ్దే (Pooja Hegde Spicy) పేరు తెరపైకి రావడం గమనార్హం. చరణ్ సరసన నటించే హీరోయిన్‌కి ఓ పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా వుంటాయట. ఈ పాత్ర విషయమై ఇప్పటికే ‘ఆచార్య’ టీమ్, పూజా హెగ్దేతో (Pooja Hegde Hot) సంప్రదింపులు జరిపినట్లుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కాగా, ఇంతవరకు ‘ఆచార్య’ టీమ్ ఈ విషయమై పెదవి విప్పలేదు.
ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఆచార్య’ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. దాంతో, చరణ్ సరసన నటించే హీరోయిన్ కూడా సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇక, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్గా నటిస్తున్న విషయం విదితమే. తొలుత ఈ పాత్ర కోసం త్రిష (Trisha Krishnan Hot) పేరు ఖరారయ్యింది. చివరి నిమిషంలో త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం విదితమే. త్రిష తప్పుకోవడంతో ఆ ఛాన్స్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal Hot) సొంతమయ్యింది.
పూజా హెగ్దే (Pooja Hegde Bikini) విషయానికొస్తే, ఆమె ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సహా పలు చిత్రాలతో తెలుగు నాట చాలా బిజీగా వుంది. హిందీలోనూ, తమిళంలోనూ ఆమెకు అవకాశాలు పోటెత్తుతున్నాయి. హిందీలో పూజా హెగ్దే రెండు సినిమాలు చేస్తోందిప్పుడు.
ఏదిఏమైనా, చరణ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తే.. ‘ఆచార్య’ సినిమాకి అదనపు గ్లామర్ యాడ్ అయినట్లే లెక్క.