Potti Sreeramulu Polavaram Project.. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడకూడదు.! కానీ, రాజకీయాల్లో రాజకీయమే వుంటుంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలుంటాయ్.!
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా, తనదైన రాజకీయ వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు. ఇందులో వింతేముంది.?
మొన్నటికి మొన్న ‘అమరజీవి జలధార’ అంటూ, జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్టిన ‘ఇంటింటికీ తాగు నీటి’ ప్రాజెక్టుకి నామకరణ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Potti Sreeramulu Polavaram Project.. ఎవరీ అమరజీవి.?
తాజాగా, పోలవరం ప్రాజెక్టుకి ‘పొట్టి శ్రీరాములు’ పేరు పెట్టాలంటూ జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఎవరీ అమర జీవి పొట్టి శ్రీరాములు.? అంటే, ‘జెన్-జి’ కిడ్స్ అనుకోవచ్చుగాక.!
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించి, ప్రాణార్పన చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అని ఎంతమందికి తెలుసు.?

చరిత్రనలా మర్చిపోయాం మనం.! ఆ చరిత్రను గుర్తు చేసుకోవాలంటే, బావితరాలు ఆ మహనీయుడ్ని స్మరించుకోవాలంటే, పోలవరం ప్రాజెక్టుకి అమర జీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకోవాల్సిందే.
నిజానికి, ఏ గొప్ప వ్యక్తీ.. తన పేరుతో ప్రాజెక్టులు కట్టాలనీ, విగ్రహాలు పెట్టాలనీ కోరుకోరు. వాళ్ళని స్మరించుకోవడమంటే, మనల్ని మనం గౌరవించుకున్నట్లు.
రాజకీయ కోణమేంటి.?
ఇందులో, నిజానికి రాజకీయ కోణాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ, కొందరు రాజకీయ కోణాన్నే చూస్తున్నారు.
సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలకు అధికారంలో వున్నవాళ్ళు తమ పేర్లు పెట్టుకోవడం కొత్త విషయమేమీ కాదు. ప్రజాధనంతో చేపట్టే కార్యక్రమాలకు సొంత పేర్లు పెట్టుకోవడం అవివేకం, అనైతికం కడా.!
కానీ, అధికారంలో వుంది కాబట్టి, ఏమైనా చేసేస్తారు.. చేసేస్తూనే వున్నారు. కానీ, ప్రజల్లో ఇలాంటివాటిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
Also Read: తస్మాత్ జాగ్రత్త.! పొరపాటున చూశారో రక్త కన్నీరే.!
అది, ఎన్నికల సమయంలో రిఫ్లెక్ట్ అవుతోంది కూడా. ఇక్కడే, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కనెక్ట్’ అయిపోయారు.!
ప్రజల మన్ననల్ని పొందడానికి, మహనీయుల పేర్లను తనకు సాధ్యమైనంతవరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు పవన్ కళ్యాణ్.
‘పవన్ కళ్యాణ్ చేస్తున్నది మంచిదే కదా.. మహనీయుల పేర్లు పెడితే, వాటిని మార్చాల్సిన అవసరం వుండదు..’ అన్నది ప్రజల మాట.!
