Power Star Kiran Abbavaram.. పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే.! ‘నన్ను పవర్ స్టార్ అని పిలవొద్దు..’ అంటూ చాన్నాళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్ స్వయంగా అభిమానులకు స్పష్టం చేసేశారు.!
మెగాస్టార్ చిరంజీవి అయితే మాత్రం తనను అంతా మెగాస్టార్ అని పిలవాలనుకుంటారా.? అభిమానులు అలా పిలుచుకుంటారంతే. దాన్ని ఆయన కాదనలేరు.
కొన్నాళ్ళ క్రితం.. అంటే, ‘బింబిసార’ సినిమా టైమ్‌లో ‘మెగాస్టార్’ అనే బిరుదుని, కళ్యాణ్‌రామ్‌కి బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేశారు కొందరు.
Power Star Kiran Abbavaram పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం..
ఈసారి కిరణ్ అబ్బవరం వంతు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా ప్రమోషన్లలో కిరణ్ బిజీగా వుంటే, ఇంకోపక్క కొందరు ‘పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం’ అంటూ రచ్చ చేశారు.
గతంలో బాలకృష్ణ అభిమానులు మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి తెస్తే, ఈసారి పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం అనే బాధ్యతని మహేష్ అభిమానులు తమ భుజాన మోశారు.
Also Read: పుత్రోత్సాహం.! చిరంజీవి ‘ఆస్కార్’ ట్వీటుపై వాళ్ళ బాధేంటి.!
కానీ, కళ్యాణ్ రామ్‌లా కాదు.! కిరణ్ అబ్బవరం స్పందించాడు. ‘బొచ్చులోగాడ్ని..’ అని తనకు తానే చెప్పేసుకున్నాడు.
‘సాధించాల్సింది చాలా వుంది. ఆయన స్థాయి ఎక్కడ.. ఆయన కష్టం ఎక్కడ.. నేనింకా చాలా దూరం వెళ్ళాలి..’ అంటూ కిరణ్ అబ్బవరం వ్యాఖ్యానించాడు ‘పవర్ స్టార్’ టైటిల్ విషయంలో.