Prabhas Pooja Hegde Radheshyam: ‘రాధేశ్యామ్’ సినిమా చుట్టూ చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి.
సినిమా నిర్మాణం వివిధ కారణాలతో ఆలస్యమవడం.. ఈ క్రమంలో కుప్పలు తెప్పలుగా పుకార్లు పుట్టుకురావడం.. వాటికి సమాధానం చెప్పలేక చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఇలా మొత్తంగా ‘రాధేశ్యామ్’ టీమ్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అన్నిటికీ మించి ప్రభాస్ (Prabhas) – పూజా హెగ్దే (Pooja Hegde) మధ్య ‘కెమిస్ట్రీ’ చెడిందనీ, సినిమా షూటింగుకి అస్సలు ఆమె సహకరించడంలేదనీ వచ్చిన పుకారు అయితే.. అందర్నీ మరింత విస్మయానికి గురిచేసింది.
ఉత్త పుకార్లేనా.? నిజమేమన్నా వుందా.?
ఇంతకీ, ఈ గాసిప్స్‌లో నిజమెంత.? అన్న ప్రశ్నకు హీరో ప్రభాస్, ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) ప్రమోషన్ల నేపథ్యంలో చాలా చాకచక్యంగా సమాధానమిచ్చాడు.

అయితే, నేరుగా విషయాన్ని ప్రస్తావించకుండా, ‘పూజా హెగ్దేతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది..’ అని చెప్పాడంతే.
ఇక, పూజా హెగ్దే అయితే, ‘ప్రభాస్ తెరపై బాహుబలి.. కానీ, చాలా మొహమాటస్తుడు.. అంత త్వరగా అమ్మాయిలతో కలిసేందుకు ఇష్టపడడు.. ఆ రిజర్వుడు పర్సనాలిటీ కారణంగానే.. మా ఇద్దరి మధ్యా స్నేహం పుట్టడానికీ, పెరగడానికీ సమయం పట్టింది..’ అని క్లారిటీ ఇచ్చేసింది.
Prabhas Pooja Hegde Radheshyam.. కెమిస్ట్రీ.. ఇదీ వాస్తవం.!
షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ చాలా ప్రొఫెషనల్‌గా వుంటారనీ, తాను కూడా అదే ఇష్టపడతాననీ, అదే ప్రొఫెషనలిజం పాటిస్తాననీ పూజా హెగ్దే చెప్పుకొచ్చింది.
ప్రభాస్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందనీ, ప్రేక్షకులు తమ కాంబినేషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తారనీ అంటోందీ బుట్టబొమ్మ.!
అద్గదీ అసలు సంగతి. దర్శకుడితో అయినా, నిర్మాతతో అయినా పూజా హెగ్దేకి (Pooja Hegde) ఎలాంటి బేదాభిప్రాయాలూ రాలేదట.
Also Read: విజయ్ దేవరకొండ ‘లవ్’ సింబల్‌కి అర్థమేంటి.?
కోవిడ్ కారణంగా ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) చాలా ఇబ్బందులు షూటింగ్ సమయంలోనే ఎదుర్కొంది. విడుదల విషయంలోనూ ‘రాధేశ్యామ్’ని కోవిడ్ ఇబ్బంది పెట్టింది. లేకపోతే, సంక్రాంతికే ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండేది.
