Prabhas Salaar Release Postponed.. ప్రభాస్ ‘సలార్’కి ఏమయ్యింది.? సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది.?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై క్రేజ్ మామూలుగా లేదు.! కానీ, ‘సలార్’ (Salaar Movie) విడుదలపై క్లారిటీ కూడా రావడంలేదు.
రిలీజ్ ‘వాయిదా’ అంటూ ప్రచారమైతే జరుగుతోంది. కానీ, ‘సలార్’ (Salaar Release Date) కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన మాత్రం రావడంలేదాయె.! ఎందుకు.?
Prabhas Salaar Release Postponed ఒత్తిడి తట్టుకోలేకనే..
ప్రభాస్ గత మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలయ్యాయి. వాటిల్లో మొదటిది ‘సాహో’ కాగా, రెండోది ‘రాధేశ్యామ్’. మూడోది ‘ఆదిపురుష్’.!
ఈ నేపథ్యంలో ‘సలార్’ (Salaar) మేకర్స్ రిస్క్ తీసుకోదలచుకోలేదన్నది ఓ వాదన. కానీ, సినిమా అంటేనే రిస్క్.! అలాంటిది, రిస్క్ చేయకపోతే ఎలా.?
సీజీ వర్క్ పూర్తవలేదనీ, ఇంకోటనీ.. రకరకాల గాసిప్స్ ‘రిలీజ్ వాయిదా’ చుట్టూ వినిపిస్తున్నాయి. వీటిల్లో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
సినిమా నవంబర్‌కి వాయిదా పడొచ్చనీ, సంక్రాంతికి రావొచ్చనీ.. ఏవేవో ఊహాగానాలు ‘సలార్’ చుట్టూ ప్రచారంలోకి వస్తున్నాయ్.
పెద్ద దెబ్బే ఇది.!
‘సలార్’ (Salaar) మీద చాలా సినిమాల భవితవ్యం ఆధారపడి వుంది. ‘సలార్’ వెనక్కి వెళితే, దానికి తగ్గట్టుగా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు, కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఖరారు అయ్యే అవకాశాలున్నాయ్.
కానీ, ‘సలార్’ రిలీజ్ విషయంలో స్పష్టత రావాల్సి వున్న దరిమిలా, మిగతా సినిమాలు అయోమయంలో పడ్డాయ్.
Also Read: విజయ్ దేవరకొండ, సమంత.! ‘లిప్పు లాకు’ వెనుక.!
సంక్రాంతికి ‘సలార్’ (Salaar) అన్న ప్రచారమే నిజమైతే, సంక్రాంతికి విడుదలయ్యే చాలా సినిమాల మీద ఆ ప్రభావం పడుతుంది.
లేదూ, సంక్రాంతి తర్వాత.. అంటే, అది మళ్ళీ వేరే తలనొప్పి.! ఏమో, ‘సలార్’ ఏం చేయబోతున్నాడో.! రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఎందుకో.!
ప్రభాస్ (Prabhas) సరసన శృతి హాసన్ (Shruti Haasan) ఈ ‘సలార్’ (Salaar Movie) సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.