Prabhas Trisha Krishnan Spirit.. ప్రభాస్ – త్రిష కృష్ణన్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయ్. అందులో ఒకటి సెన్సేషనల్ హిట్ కాగా, మిగిలినవి రెండూ జస్ట్ యావరేజ్ అంతే.!
అయినాగానీ, ప్రభాస్ – త్రిష (Trisha Krishnan) కాంబినేషన్ సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.! చాలాకాలమైంది ఈ కాంబినేషన్‌లో సినిమా వచ్చి.
ఇటు ప్రభాస్, అటు త్రిష.. ఈ ఇద్దరి అభిమానులూ పండగ చేసుకునేలా ఓ గాసిప్ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా.. అంటూ షికారు చేసేస్తోంది.
Prabhas Trisha Krishnan Spirit.. స్పిరిట్ కోసం కలవబోతున్నారా.?
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కాల్సి వుంది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రిష పేరుని దర్శకుడు పరిశీలిస్తున్నాడట.
నిజమేనా.? మామూలుగా అయితే, ఇలాంటి గాసిప్స్ విషయమై వీలైనంత వేగంగా స్పష్టత ఇచ్చేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగా.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
మరోపక్క, ఆలూ లేదు.. చూలూ లేదు.. అప్పుడే సినిమాలో హీరోయిన్ గురించిన ముచ్చట్లా.? అంటూ ఈ గాసిప్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
‘యానిమల్’ (Animal Movie) తర్వాత తన తదుపరి సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాస్త సమయం తీసుకుంటున్నాడు.
ప్రభాస్ సైతం, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ‘రాజా సాబ్’ విడుదల కావాలి.. ‘సలార్’ రెండో పార్ట్ పూర్తవ్వాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే, కథ చాలానే వుంది మరి.