Pragya Jaiswal Yoga.. యోగా అంటే.! ఒకప్పుడు, అది హిందువులకు మాత్రమే సంబంధించిన ఆధ్మాతిక వ్యవహారంలా చూసే పరిస్థితి ఇతర మతాల్లో వుండేది.!
కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇస్లామిక్ సమాజం, ఒకానొక సమయంలో యోగా పట్ల ఆంక్షలు విధించినా, ఇప్పుడు అక్కడా యోగా పట్ల అవగాహనా కార్యక్రమాలు చూస్తున్నాం.!
నిజానికి, యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం.! ప్రతి యేడాదీ ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని’ జూన్ నెలలో నిర్వహించుకుంటున్నాం.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు.. సోషల్ మీడియా వేదికగా యోగా చేస్తూ, వాటికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Pragya Jaiswal Yoga.. యోగా అంటే.. మరీ అంతలా కష్టపడిపోవాలా.?
కొందరైతే, శరీరాన్ని విల్లులా వంచేస్తారు. ఇంకొందరు రబ్బరులా సాగదీసేస్తారు.! మరికొందరేమో, పొట్ట భాగాన్ని నానా రకాలుగా కష్టపెట్టేస్తారు.!
అసలు యోగా ఎలా చెయ్యాలి.? ఈ విషయమై వైద్యులు చెప్పే మాటల్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందే.

ఎవరి శరీరాన్ని ఎంతలా కష్టపెట్టొచ్చో.. అంత వరకు మాత్రమే కష్టపెట్టాలి. అంతకు మించి, ఎక్కువ చేసేస్తే.. ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పెట్టే ఫొటోల్ని ఫాలో అయితే అంతే సంగతులు.! ముమ్మాటికీ, యోగా అనేది తొలుత నిపుణుల పర్యవేక్షణలోనే జరగాల్సి వుంటుంది.
క్రమంగా శరీరం, యోగాసనాలకు అలవాటు పడ్డాక, క్రమక్రమంగా కఠినతరమైన యోగాసనాల్ని వేయడానికి వీలు కలుగుతుంది.
అఖండం.. ప్రగ్యా జైస్వాల్ యోగాసనం.!
చూస్తున్నారుగా.! ఫొటోల్లో వున్నదెవరో తెలుసు కదా.? అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ‘అఖండ’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
యోగా అంటే.. ఫిట్నెస్ కోసం మాత్రమే కాదు.! యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యానికి కారణమవుతుంది. ఫిట్‌గా వుంచుతుంది.. ఆరోగ్యంగా వుంచుతుంది.. ఆన్నందాన్ని కూడా ఇస్తుంది యోగా.!

భంచిక్.. భంచిక్ చెయ్యి బాగా.. వంటికి యోగా మంచిదేగా.. అంటూ ఎప్పుడో.. చాన్నాళ్ళ క్రితమే ఓ తెలుగు సినిమాలో పాటొకటి వచ్చింది.!
నిజమే, యోగా.. మంచిదేగా.! అందుకే, రోజూ చేసేద్దాం.. క్రమం తప్పకుండా.!