Pragya Nayan IPL 2024.. ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించిన అందాల భామ ప్రగ్యా నయన్‌కి ప్రస్తుతానికైతే పెద్దగా గుర్తింపు దక్కలేదు.
కానీ, సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ, బాగానే లైమ్ లైట్‌లో వుండేందుకు ప్రయత్నిస్తోంది ప్రగ్యా నయన్ (Pragya Nayan). ఈ బ్యూటీ పూర్తి పేరు ప్రగ్యా నయన్ సిన్హా.
ఇండియన్ ప్రీయిర్ లీగ్ (Indian Premiere League 2024) క్రికెట్ పోటీలంటే, హై ఓల్టేడ్ యాక్షన్ మాత్రమే కాదు, అదరగొట్టే గ్లామర్ కూడా.

ఆయా జట్ల తరఫున అందాల భామలు సోషల్ మీడియా వేదికగానూ, మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలలోనూ సందడి చేస్తుంటారు.
Pragya Nayan IPL 2024.. సన్ రైజర్స్.. ప్రగ్యా నయన్ గ్లామర్ అదుర్స్..
తాజాగా, ప్రగ్యా నయన్ ఇదిగో ఇలా సందడి చేసింది.. అదీ సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టుకి మద్దతుగా. సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు, ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ సాధించింది.. అదీ ముంబై జట్టు మీద.
ఈ మ్యాచ్‌లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ మ్యాచ్ తిలకించారు.. సన్ రైజర్స్ హైద్రాబాద్ విక్టరీని ఆస్వాదించారు.

ప్రగ్యా నయన్ కూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)తో కలిసి స్టేడియంలో హడావిడి చేసింది సన్ రైజర్స్ హైద్రాబాద్ ఫ్లాగ్ పట్టుకుని.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. అందానికి తగ్గ అవకాశాలైతే సరైన రీతిలో రావడంలేదనిపిస్తోంది కదా.. ఈ బ్యూటీని చూస్తోంటే.

లక్కు కలిసొస్తే, స్టార్ హీరోయిన్ అయిపోవడం ఏమంత కష్టమైన పని.!? ఐపీఎల్ (Indian Premiere League) బ్యూటీస్ చాలామంది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంటారు.
Also Read: ఏంటి పాపా.. రాజకీయాల్లోకి వస్తున్నావా.?
మరి, సినిమాల్లో ఆల్రెడీ నటించేస్తోన్న ఈ ప్రగ్యా నయన్‌ని, టాలీవుడ్ (Tollywood) దర్శక నిర్మాతలు ఒకింత సీరియస్‌గా తీసుకోవచ్చు కదా.?