Prakash Raj Just Asking The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
అబ్బే, అందులో చూపించినవన్నీ అవాస్తవాలేనంటారు కొందరు. కాదు కాదు, ‘నిప్పులాంటి నిజమది.. ఆ నిజాన్ని ఇప్పటిదాకా కప్పి పుచ్చి, కాకమ్మ కథల్ని చెబుతూ వచ్చారు కాశ్మీర్ విషయంలో..’ అన్నది ఇంకొందరి వాదన.
ఎవరి గోల వారిది.! సందట్లో సడేమియా అన్నట్టు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఓ సెటైర్ వేసేశారు.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ మీమ్ పట్టుకుని.
బాబోయ్ ఎన్ని ఫైల్స్ వున్నాయో.!
గోద్రా ఫైల్స్, డిమానిటైజేషన్ ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, జీఎస్టీ ఫైల్స్, కోవిడ్ ఫైల్స్, గంగా ఫైల్స్.. ఇలా పలు కీలకమైన అంశాలున్నాయి ఆ మీమ్‌లో.
“Dear supreme actor turned producer.. will you arm twist these files too and release them.. Just Asking” అన్నది ప్రకాష్ రాజ్ ట్వీటు సారాంశం.
గోద్రా అల్లర్ల ఘటన వెనుక ఏదో దాచిన సత్యం వుందన్నది ప్రకాష్ రాజ్ అనుమానం. ఢిల్లీ అల్లర్ల విషయంలోనూ అదే అనుమానం వుండొచ్చు. జీఎస్టీ, నోట్ల రద్దు, కోవిడ్, గంగా ప్రక్షాళన.. ఇలాంటి వ్యవహారాలపై ఏవేవో అనుమానాలు ప్రకాష్ రాజ్‌కి వున్నాయేమో.
ప్రకాష్ రాజ్ సారూ.. మీరే తిప్పేయొచ్చుగా.!
ప్రకాష్ రాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత.. అలాగే దర్శకుడు కూడా. సో, ప్రకాష్ రాజ్ తలచుకుంటే తాను నమ్మిన వాస్తవాల్ని సినిమాగా తెరకెక్కించేయొచ్చు.
ఎవరో చేతిని తిప్పి సినిమాలు తీశారని ఆరోపిస్తున్నప్పుడు, పోనీ.. తిప్పకుండానే కాశ్మీర్లో ఏం జరిగిందో తెరకెక్కించాలి కదా.?
కొన్ని విషయాల్లో ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే, ‘నిజమే కదా..’ అనిపిస్తుంది. అదే సమయంలో, ఇంకొన్ని సందర్భాల్లో ఆయన సంధించే ప్రశ్నలు అర్థ రహితం అనిపిస్తాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనేది ఓ సినిమా. దానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
Also Read: సాములోరి రాజకీయం.! ఏం ఖర్మ పట్టింది బాసూ.!
సినిమాల్లో చూపించేదంతా నిజమేనని జనం అనుకోరు. వాటిని పట్టుకుని గొడవలకు వెళ్ళరు.. సమాజంలో విపరీతమైన మార్పులేమీ వచ్చేయవు.
ఆ విషయం అందరికన్నా బాగా ప్రకాష్ రాజ్‌కే తెలుసు. అయినా, ఎందుకింత కలవరం.? జస్ట్ ఆస్కింగ్.!