Prakash Raj Kashmir Files.. ఓ సినిమాని చెత్త సినిమా.. అని ఓ సినీ ప్రముఖుడు అంటే ఎలా వుంటుంది.? సరే, సినిమా నచ్చడం.. నచ్చకపోవడం.. అన్నది ఆయా వ్యక్తుల ఇష్టం.
వ్యక్తిగత అభిప్రాయాలు వేరు.. బహిరంగ వేదికలపై ‘చెత్త’ అంటూ కామెంట్లు వేయడం వేరు. ప్రకాష్ రాజ్ అంటేనే అతి.!
కొన్నిసార్లు బాగానే మాట్లాడతాడు.. కొన్నిసార్లు మాత్రం హద్దులు మీరతాdraడు.! ప్రకాష్ రాజ్ చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలు.. గొప్ప గొప్ప నటన.. అని అనగలమా.?
ప్రకాష్ రాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఫిలిం మేకర్ కూడా.!
దర్శకుడు, నిర్మాత కూడా అయిన ప్రకాష్ రాజ్.. ఓ సినిమాని ‘చెత్త’ అనడం.. ‘ఉమ్మేశారు’ అనడం.. ఆయన సంస్కార హీనతను తెలియజేస్తుంది.
కుసంస్కారి ప్రకాష్ రాజ్.. అనే విమర్శలకు ఆయన ఏం సమాధానం చెబుతారు.?
Mudra369
వాటిల్లో కొన్ని గొప్ప సినిమాలుంటాయ్.. కొన్ని చెత్త సినిమాలుంటాయ్. సినిమాల్లో ప్రకాష్ రాజ్ ‘అతి’ చేసిన సందర్భాలు చాలానే కనిపిస్తాయ్.
Prakash Raj Kashmir Files.. ఉమ్మేశారా.? ఏంటీ దిగజారుడుతనం.?
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశంలో ఓ ప్రభంజనమే సృష్టించింది. సరే, సినిమాలో నిజమే చూపించారా.? లేదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.

సినిమాగా చూస్తే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చాలా పెద్ద విజయం సాధించింది. దానికి అంతర్జాతీయ వేదికలపై అవార్డులు దక్కడం, దక్కకపోవడం అనేది మళ్ళీ ఇంకో చర్చ.
కానీ, అంతర్జాతీయ వేదికలపై సినిమాని ఎవరూ పట్టించుకోలేదనీ, ఉమ్మేశారనీ.. ‘ప్రోపగాండా’ సినిమా అనీ ప్రకాష్ రాజ్ ఏవేవో మాట్లాడేశాడు.
‘పఠాన్’పై మొరిగారు.. కరవలేకపోయారు.!
మొరగడమేంటి.? కరవడమేంటి.? కుక్కలతో పోల్చాడు ప్రకాష్ రాజ్ ఎవర్నో.! ఇంకెవర్ని సగటు సినీ ప్రేక్షకుడ్నే. సోషల్ మీడియాలో సగటు సినీ అభిమానులే.. సినిమాల్ని ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Jr NTR.. తప్పెవరిది.? ఆ అభిమానులదా.? ఈ హీరోలదా.?
‘బాయ్‌కాట్ పఠాన్’ అని నినదించింది నెటిజన్లే.. వాళ్ళూ సినీ అభిమానులే.! కాకపోతే, అది వేరే బ్యాచ్. దురభిమానులనొచ్చు.. ఇంకోటేదైనా అనొచ్చు.
ఇంతకీ, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రకాష్ రాజ్ చేస్తున్నదేంటి.? ముమ్మాటికీ మొరుగుడే.! ఎందుకంటే, ఆయన కరవలేడు మరి.!