Pranavi Manukonda Time Starts.. టాలీవుడ్‌లో ఎందరో తెలుగమ్మాయిలు. సీనియర్ నటి అంజలి నుంచి నేటి వైష్ణవీ చైతన్య వరకూ ఎందరో తమ టాలెంట్ చూపిస్తూ వచ్చారు.
అయితే, సక్సెస్ అయిన వాళ్లెంత మంది.? ఆ సంగతి పక్కన పెడితే, నేటి జనరేషన్ తెలుగమ్మాయిలు టాలెంట్ చూపిస్తున్నారు. మరీ శ్రీలీల రేంజ్‌లో కాకపోయినా, ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
‘బేబీ’ సినిమాతో సోషల్ మీడియా సెన్సేషన్ వైష్ణవీ చైతన్య కెరటంలా దూసుకొచ్చింది. తాజాగా ఇంకో తెలుగమ్మాయ్ బుల్లితెర నుంచి పెద్ద తెర పైకి హీరోయిన్‌గా పరిచయమై టాలెంట్ చూపిస్తానంటోంది.
Pranavi Manukonda Time Starts.. ఆ చిన్నారియే ఈ చిలిపి హీరోయిన్..
ఆమె ఎవరో కాదు, ప్రణవి మానుకొండ. ‘ఎవరే నువ్వు మోహిని’, ‘గంగ మంగ’ తదితర సీరియల్స్‌లో లీడ్ రోల్ పోషించి బుల్లితెర ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేసిన ముద్దుగుమ్మే ఈ ప్రణవి.

చిన్నప్పటి నుంచీ నటనపై వున్న ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటింది. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘ఉయ్యాలా జంపాలా’ తదితర సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించింది.
వీటితో పాటూ, సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోస్‌తోనూ ప్రణవి సూపర్ పాపులర్. యాక్టింగ్‌పై వున్న ఇంట్రెస్ట్‌తో చిన్నప్పటి నుంచే సింగింగ్, డాన్సింగ్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది.
అచ్చం అనుష్కలాగే..
‘అరుంధతి’ సినిమాలో అనుష్కను చూసి అచ్చు అలాగే డైలాగులు పలికేసేదట. అద్దంలో చూసుకుని తనను తాను అనుష్కలా ఫీలయ్యేదాన్నని క్యూట్‌గా చెప్పేస్తోంది ప్రణవి (Pranavi Manukonda).
ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే, మరోవైపు చదువునూ నిర్లక్ష్యం చేయలేదు ప్రణవి. తాజాగా ‘స్లమ్ డాగ్ హాజ్బెండ్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఈ సినిమాలో హీరో. సినిమా సక్సెస్ సంగతి అటుంచితే, ప్రణవి(Pranavi Manukonda) పాత్రకు మంచి పేరొచ్చింది ఈ సినిమాలో.
‘బేబీ’ తరహాలో ఈ సినిమానీ బాగా ప్రమోట్ చేసి వుంటే, సక్సెస్ రేటు మరోలా వుండేదేమో. ఏది ఏమైతేనేం, తెలుగమ్మాయిలపై చిన్న చూపు చూసే మన టాలీవుడ్‌లో కాస్త మార్పొచ్చినట్లే కనిపిస్తోంది.
Also Read: క్యూటు క్యూటుగా.. కథానాయికలుగా మారిపోతున్నారు.!
అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలే తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేద్దాం బ్రో.. అని చెప్పినప్పుడు మేకర్లు పట్టించుకోవాలి కదా.! మొన్న వైష్ణవి, ఇప్పుడు ప్రణవి.. ఇలా ఇంకా చాలా మంది తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో సక్సెస్ అవ్వాలని, అవుతూనే వుండాలని ఆశిద్దాం.