Table of Contents
Pranitha Subhash Barbie Doll.. ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ స్కేల్ చాలా తక్కువగా వుండేది. పెళ్లయ్యిందంటే ఆ హీరోయిన్ కెరీర్ అక్కడితో ఖతమైపోయినట్లే.
కానీ, ఇప్పుడలా కాదు. పెళ్లి వేరు, కెరీర్ వేరు. చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు.
అంతేకాదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కెరీర్ పట్ల క్లారిటీతో వుంటున్నారు.
అలా చాలా మంది అందగత్తెలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్.. అంటూ వెండితెరపై తమ అంద చందాలతో మెరుపులు మెరిపిస్తున్నారు.
‘అత్తారింటికి దారేది’ సినిమాతో పాపులర్ అయిన ప్రణీత సుభాష్ కూడా అంతే.
Pranitha Subhash Barbie Doll.. ఇద్దరు పిల్లల తల్లి అయినా తరగని అందం..
పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. అయినా వన్నె తరగని అందంతో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్లతో నెట్టింటిని షేక్ చేస్తుంది.

నయా భామలకు ఎంత మాత్రం తీసిపోని అందంతో షైన్ అవుతోంది ప్రణీత సుభాష్. తాజాగా బేబీ పింక్ కలర్ డ్రస్‌లో ప్రణీత క్యూట్ పోజులు అచ్చం బార్బీ బొమ్మను తలపిస్తున్నాయ్.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యిందా.?
కొంత మంది యాక్టర్స్ బ్యాక్ గ్రౌండ్ తీస్తే, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను.. అంటుంటారు. ప్రణీత ఫ్యామిలీ విషయానికి వస్తే, తల్లి, తండ్రి ఇద్దరూ డాక్టర్లే కావడం విశేషం.
కానీ, ప్రణీత మాత్రం ఆ రంగం వైపు ఆసక్తి చూపించలేదు. యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించింది. చదువు తర్వాత యాక్టింగ్‌పై వున్న మక్కువతో సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది.
అంతకు ముందే ఒకటీ అరా సినిమాల్లో నటించినప్పటికీ, ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చింది.
బాపుగారి బొమ్మా..
ఆ సినిమాలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే ‘బాపూ బొమ్మ.. ’ అని పొగిడించేసుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, పెళ్లి చేసుకుని వ్యక్తిగతంగా సెటిలైపోయింది.
Also Read: అమృత ఫడ్నవిస్ వస్త్రధారణపై ఎందుకింత రచ్చ.?
పెళ్లయినా వెండితెరకు దూరం కాలేదు. సినిమాల్లో నటించకపోయినా.. ఫోటో షూట్ అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌కి దగ్గరగానే వుంటూ వచ్చింది.
ప్రస్తుతం ప్రణీతకు బాలీవుడ్ నుంచి ఎక్కువగా సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా వుంది ప్రణీత సుభాష్.
