Pranitha Subhash చాలా కాలం తర్వాత అట.! ఇంతకీ ఏంటట.? అందాల భామ ప్రణీత, తెలుగు తెరపై తొలిసారి కనిపించింది ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో.
తనీష్ హీరో.! ఆ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. కానీ, ప్రణీతకి కొంత గుర్తింపు అయితే బాగానే వచ్చింది.
ఎవరి గోల వారిది.! ఏమో, ఆమెకు అది అందంగా కనిపించిందేమో.. చాలా కొత్తగా అనిపించిందేమో.! ఆమెని అభిమానించేవారికీ అలాగే కనిపిస్తోందేమో.!
Mudra369
తెలుగులో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించిందిగానీ, స్టార్‌డమ్ అయితే నటిగా సంపాదించుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్ సరసన..
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ప్రణీత ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. హీరోయిన్ కాదు.. హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అక్క పాత్ర అది.!

అయితేనేం, పవన్ కళ్యాణ్‌తో (Power Star Pawan Kalyan) పాటేసుకుంది.. ఆ పాట ఇప్పటికీ మార్మోగుతూనే వుంటుంది.
అన్నట్టు, ప్రణీతకి కొన్నాళ్ళ క్రితమే పెళ్ళయ్యింది.. ఓ బిడ్డకు తల్లయ్యింది కూడా.! కూతురితో కలిసి అడపా దడపా సోషల్ మీడియాలో ఫొటోలు వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది ప్రణీత.
Pranitha Subhash చీరకట్టులో.. చాలాకాలం తర్వాత.!
ఇదండీ అసలు విషయం.! చాలా కాలం తర్వాత చీరకట్టులో ఫొటోలకు పోజులిచ్చిందట.! ఛీ.. ఛీ.. ఇది చీరకట్టు ఏంటి.? ఇది మోడ్రన్ డ్రెస్సింగ్ అంతే.!
Also Read: దెబ్బకు దిగొచ్చిన రష్మిక.! మొట్టికాయ ఎవరు వేశారబ్బా.?
లేస్డ్ లోదుస్తుల తరహాలో జాకెట్ వేసి.. ఆ పై చీర కప్పుకుంటే, అది ‘అందమైన చీరకట్టు ఎలా అవుతుంది.?’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఎవరి గోల వారిది.! ఏమో, ఆమెకు అది అందంగా కనిపించిందేమో.. చాలా కొత్తగా అనిపించిందేమో.! ఆమెని అభిమానించేవారికీ అలాగే కనిపిస్తోందేమో.!
కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం అంతే.! ఈ ట్రోలింగుని ఆపలేమేంతే.! అసలీ గోల తగ్గేది లేదంతే.!