Prashanth Neel Liquor Story తప్పతాగి జీవితాల్ని నాశనం చేసుకుంటారు కొందరు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ, ఎవడిష్టం వాడిది. ఎవడి లివర్ మీద వాడికి హక్కుంటుందని సరిపెట్టుకోవాలేమో.!
సినిమాల్లో లిక్కర్ కిక్కిచ్చే సన్నివేశాలకి సెపరేటు క్రేజ్ వుంది. పాటలు, ఫైట్లూ, రొమాన్స్.. ఇలా అన్నింటికీ లిక్కర్ కిక్ ఇస్తుంటారు. అంటే, తెరపై ఆయా పాత్రలు మద్యం మత్తులో జోగుతున్నట్లు చూపించడమన్నమాట.
కానీ, అక్కడ విషయం వేరే. ఓ సంచలన దర్శకుడు పెగ్గు వేస్తే తన పెన్ను నాట్యం చేస్తుందని చెబుతున్నాడు. ఆ పెగ్గు కూడా ఆషా మాషీగా కాదట. బాగా కిక్కు తలకెక్కేలా వుండాలట.
సినిమా స్టోరీలు ఇలాక్కూడా రాస్తారా.?
మత్తు బాగా ఎక్కిన తర్వాత రాసే సన్నివేశం ఓ రేంజ్‌లో వస్తుందట. కథలు కూడా అలాగే రాస్తాడట. రాసిన దాన్ని పొద్దున్నే చూసుకుంటాడట.
రాత్రి తాగితే వచ్చిన కిక్కు, పొద్దున్న తాగకుండా స్క్రిప్టు చదివితే అంతకు మించి కిక్కు లభిస్తే అప్పుడు ఆ సన్నివేశం మీద గురి కుదురుతుందట ఆ దర్శకుడికి.
సరదాగా కాదు, సీరియస్‌గానే ఈ పెగ్గు కహానీ చెప్పాడు ఆ దర్శకుడు. ఆ దర్శకుడెవరంటే, ఇంకెవరు ప్రశాంత్ నీల్ (Prashanth Neel).
‘కేజీఎఫ్’ సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ స్టైలిష్ అండ్ మాస్ డైరెక్టర్ ఈ ప్రశాంత్ నీల్.
హిట్టు మీదున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చెల్లిపోతుంది. సినిమా తేడా కొడితే, తప్పతాగి కథలు రాస్తాడు కాబట్టే అలా తగలడింది అనేయడం ఎంత సేపు.? జర జాగత్త ప్రశాంతం.!
Also Read: ఔనా.! ఎన్టీయార్‌కి మీరా చోప్రా సర్టిఫికెట్ అవసరమా.?
సక్సెస్ ఎప్పుడూ ఒక్కరి సొత్తు కాదు. సినీ రంగంలో ఆ కిక్కు ఎప్పుడూ దోబూచులాడుతుంటుంది. మధ్యపానం ఆరోగ్యానికే కాదు, కెరీర్‌కి కూడా హానికరమే.