Table of Contents
Praveen Pagadala Death Mystery.. ఓ వ్యక్తి, రోడ్డు పక్కన నిర్జీవంగా పడి వున్నాడు. రాజమండ్రి సమీపంలో జరిగిందీ ఘటన.! రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా వుంది ఘటనా స్థలంలోని పరిస్థితి.
కట్ చేస్తే, మృతుడి పేరు ప్రవీణ్ కుమార్ పగడాల అనీ, అతను పేరొందిన పాస్టర్ (క్రైస్తవ మత ప్రచారకుడు) అని తేలింది.
సీన్, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి మారింది. అక్కడ ‘క్రైస్తవ సంఘాల ప్రతినిథుల’ ముసుగులో కొందరు, ‘రోడ్డు ప్రమాదం కాదు, హత్య’ అంటూ నినాదాలు చేశారు.
మాజీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. ఇస్లాం మతానికి చెందిన మోటివేషనల్ స్పీకర్ కూడా, ‘హత్య’ జరిగి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
Praveen Pagadala Death Mystery.. మత రాజకీయమే శాపం..
ఇకనేం, రాజకీయానికి ఇంతకన్నా ‘విషయం’ ఇంకేమైనా అవసరం వుంటుందా.? కంటెంట్ దొరికేసింది.. ఎవరికి వారు రెచ్చిపోయారు.!
ఓ న్యూస్ ఛానల్ రంగంలోకి దిగేసి, ‘హత్య’ అన్న కోణంలో, కథనాలు వండి వడ్డించేసింది. మరికొన్ని మీడియా సంస్థలూ ఇదే బాట పట్టాయి.
ప్రాథమికంగా ‘రోడ్డు ప్రమాదం’ అనే పోలీసులు అనుమానించారు. రచ్చ నేపథ్యంలో, హత్య కోణంలోనూ దర్యాప్తుని ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
దర్యాప్తు సందర్భంగా, పాస్టర్ ప్రవీణ్ ‘లిక్కర్’ లీలలు వెలుగులోకి వచ్చాయి. తప్పతాగి బైక్ నడిపి, పలుమార్లు యాక్సిడెంట్స్ చేసినట్లు గుర్తించారు.. అదీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.
తప్పతాగి.. నిర్లక్ష్యంగా యాక్సిడెంట్లు చేసి..
హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద సుదూర ప్రయాణం ఎందుకు చేయాల్సి వచ్చింది.? హైద్రాబాద్ శివార్లలోనే, మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, మద్యం సేవించి.. వాహనం నడపడమేంటి.?
పోనీ, విజయవాడ సమీపంలో యాక్సిడెంట్ అయ్యాక అయినా, ప్రయాణం మానుకున్నాడా.? అంటే, అదీ లేదు. బైక్ హెడ్ లైట్, యాక్సిడెంట్ వల్ల పగిలిపోయింది. ఇండికేటర్స్‌తోనే రాజమండ్రి వరకూ వెళ్ళాడు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయి వుండొచ్చు పాస్టర్ ప్రవీణ్ కుమార్.
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో సనాతన ధర్మం గురించి మాట్లాడటం వల్ల పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగిందంటూ కొందరు పనికిమాలిన ఈక్వేషన్స్‌ని తెరపైకి తెస్తున్నారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా..
గత కొంతకాలంగా క్రైస్తవ సంఘాల మధ్య అనైక్యత, ఆధిపత్య పోరు కారణంగా.. వివాదాలు చూస్తున్నాం. చంపుకునేదాకా వెళుతున్నాయి ఈ వివాదాలు.
పాస్టర్ ప్రవీణ్ కుమార్‌కి కూడా చాలా మందితో శతృత్వం వుంది. ఇస్లాం మతంపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కొన్నాళ్ళ క్రితమే చేశారాయన. దానికి అట్నుంచి కూడా కౌంటర్ ఎటాక్ గట్టిగానే వచ్చింది.
తనను చంపేస్తామంటున్నారంటూ, సదరు ఇస్లాం మత పెద్దల గురించి ప్రస్తావిస్తూ కొన్నాళ్ళ క్రితమే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు ప్రవీణ్ కుమార్ పగడాల.
Praveen Pagadala Death Mystery.. మత రాజకీయానికి సూత్రధారి ఎవరు.?
రోడ్డు ప్రమాదమా.? హత్యా.? అన్నది పోలీసు విచారణలో తేలుతుంది. కానీ, అస్సలేమాత్రం సబంధం లేని పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
డిప్యూటీ సీఎం మీద ఇంత దుష్ప్రచారం జరుగుతోందంటే, వ్యవస్థలు ఏం చేస్తున్నట్లు.? ఈ పాస్టర్ డెత్ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది.? ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్లే.!
పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వైసీపీ, తమ సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా ప్రవీణ్ కుమార్ పగడాల డెత్ మిస్టీకి పవన్ కళ్యాణే కారణమని ఆరోపణలు చేయిస్తోందంటే, తెరవెనుకాల పెద్ద కుట్రే జరుగుతోందన్నమాట.