తెలుగు సినిమా టైటిళ్ళలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపిస్తుంటుంది. ‘వెరైటీ టైటిల్’ కోసం సినీ పరిశ్రమలో ఎప్పుడూ తపన కనిపిస్తుంటుంది. సినిమాతో సంబంధం లేని టైటిళ్ళు కూడా చాలానే చూశాం. కొన్ని టైటిళ్ళను పలకడానికీ ఇబ్బందికరంగా వుంటుంది. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల టైటిళ్ళ (Prema Kadanta Anu Emmanuel Allu Sirish) విషయంలో ఈ ఇబ్బంది కాస్త ఎక్కువ.
అసలు విషయానికొస్తే, ఓ కొత్త సినిమా టైటిల్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనూ, తెలుగు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. అదే, ‘ప్రేమ కాదంట’ అనే సినిమా టైటిల్. అల్లు శిరీష్ (Allu Sirish), అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) జంటగా నటిస్తోన్న సినిమా ఇది.
సిక్స్ ప్యాక్ ఫిజిక్ చూపిస్తూ ఇటీవల అల్లు శిరీష్ కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం విదితమే. బహుశా ఆ కసరత్తులు ఈ సినిమా కోసమే కావొచ్చు. అనూ ఇమ్మాన్యుయేల్ అయితే, స్టార్ హీరోయిన్.. అనిపించుకుని, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో దాదాపుగా తెరమరుగైపోయింది. ఇప్పుడీ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలనుకుంటోంది.
టైటిల్ ‘ప్రేమ కాదంట’ (Prema Kadanta).. సౌండింగ్ బాగానే వుంది. కాస్తంత తేడాగా కూడా వుంది. ప్రేమ కాకపోతే ఏంటంట.? అసలే ఈ మధ్య ఓటీటీ ఆలోచనలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘యూత్’ పేరుతో అసభ్యకరంగానూ కనిపిస్తున్నాయి.
తెలుగు సినిమా హీరోయిన్ అంటే.. సిగరెట్ కాల్చాలి.. మందు తాగాలి.. బోల్డన్ని ఎఫైర్లు వుండాలి.. అన్నట్టుగా హీరోయిన్ల పాత్రల్ని కొందరు దర్శకులు దిగజార్చేస్తున్నారు. ఆ కారణంగానే, ‘ప్రేమ కాదంట’ అన్న సినిమా టైటిల్ మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘ప్రేమ కాదంట’ ఫస్ట్ లుక్ వదిలారు.. అది రొమాంటిక్ కోణంలోనే కనిపిస్తోంది. ఇంతకీ, సినిమా ఎలా వుండబోతోంది.? ఇప్పుడే ఓ అంచనాకి వచ్చేయడం కష్టం. టైటిల్ మాత్రం ఆడియన్స్ అటెన్షన్ (Prema Kadanta Anu Emmanuel Allu Sirish) బాగానే డ్రా చేస్తోంది.