Table of Contents
మిస్టర్ మజ్ను (Mr Majnu Preview).. అక్కినేని అఖిల్‌కి (Akhil Akkineni) హీరోగా ఇది మూడో సినిమా. దర్శకుడిగా వెంకీ అట్లూరికి (Venky Atluri) ఇది రెండో సినిమా. హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌కి (Nidhi Agarwal) తెలుగులో ఇది రెండో సినిమా. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu Preview) ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu Preview) సినిమాకి సంబంధించి చాలా విశేషాలున్నాయి. టీజర్‌తో ఎట్రాక్ట్ చేసి, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ‘మిస్టర్ మజ్ను’ యువ ప్రేక్షకుల్లో ఆశలు బాగానే పెంచుతోంది. ఎందుకంటే ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా అన్పిస్తోంది మరి.
భారీ అంచనాల నడుమ ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu Preview) విశేషాలేంటో తెలుసుకుందామా మరి.!
బుడి బుడి అడుగుల అక్కినేని హీరో (Mr Majnu Preview)
చిన్నప్పుడు బుడి బుడి అడుగులు వేయాల్సిన సమయంలోనే కెమెరా ముందుకొచ్చి తొలి విజయాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని అఖిల్, నెలల వయసులోనే నటనలో పాఠాలు నేర్చుకున్నాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
‘మనం’ సినిమాలో తళుక్కున మెరిసిన అఖిల్, వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అఖిల్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విషయం విదితమే. అయితే తొలి సినిమా ఆశించిన విజయాన్నివ్వలేదు. రెండో సినిమా ‘హలో’ కూడా అఖిల్ కోరుకున్న స్థాయిలో విజయాన్ని అందివ్వకపోవడంతో నిరాశపడాల్సి వచ్చింది.
సినిమాలు విజయాల్ని అందుకోకపోయినా, అఖిల్‌కి సంబంధించి ఎలాంటి ప్రయత్న లోపం లేదనే ప్రశంసలు అందుకోవడం చిన్న విషయం కాదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందేనన్న కసితో అఖిల్ చేసిన ‘మిస్టర్ మజ్ను’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అందాల ‘నిధి’.. అదరగొట్టేందుకు సిద్ధం
బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్నీ అక్కినేని కాంపౌండ్‌లో చేయడం గమనార్హం. తొలి సినిమా ‘సవ్యసాచి’లో నాగచైతన్య సరసన కన్పించిన నిధి అగర్వాల్, రెండో సినిమాని అక్కినేని అఖిల్‌తో చేసింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో నిధి తనదైన ప్రత్యేకతను చాటుకున్నట్లే కన్పిస్తోంది.
‘సవ్యసాచి’లో ఎలాగైతే నాగచైతన్యతో మంచి కెమిస్ట్రీ పండించిందో, అంతకు మించిన కెమిస్ట్రీ ఈ ‘మిస్టర్ మజ్ను’లో అఖిల్‌తో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) పండించిందని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. గ్లామర్‌లో నిధికి వంక పెట్టడానికేముంది? అన్నట్టు, ఈ సినిమాలో నిధికి మంచి డాన్స్ పార్టనర్ దొరికాడు అఖిల్ రూపంలో. ఇద్దరూ కలిసి డాన్సులు ఇరగదీసేశారట.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిధి అగర్వాల్ యాక్టింగ్‌కి స్కోప్ వున్న ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో చేసిందని తెలుస్తోంది.
‘తొలిప్రేమ’ని మించే విజయం సాధిస్తాడా? (Mr Majnu Preview)
నటుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు, రచయితగా మారాడు. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టుకుని సత్తా చాటుతున్నాడు. అతనే వెంకీ అట్లూరి. దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి, మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడనడం అతిశయోక్తి కాదు.
ఈ యువ దర్శకుడి నుంచి వస్తోన్న రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’పై అంచనాలు ఈ స్థాయిలో ఏర్పడడానికి కారణం కూడా అతని తొలి సినిమా ‘తొలిప్రేమ’ సాధించిన విజయమే. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వెంకీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడట.
యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ ఆశీస్సులు
‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మంచి నటుడిగా పరిణతి సాధించేందుకు, ప్రశంసలు పొందేందుకు అఖిల్‌కి ఎక్కువ సమయం పట్టబోదనీ, అఖిల్ ఈ సినిమాతో బంపర్ హిట్ కొడతాడనీ యంగ్ టైగర్ ఆకాంక్షించాడు, అఖిల్‌ని ఆశీర్వదించాడు కూడా.
మరోపక్క మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా అఖిల్‌కి విషెస్ అందించాడు. అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్ సందడి చేసిన సంగతి తెల్సిందే.
ఏదిఏమైనా, ప్రీ రిలీజ్ మంచి అంచనాల్ని సంపాదించుకున్న ‘మిస్టర్ మజ్ను’ (Mr Majnu Preview) విడుదలకు ముందు దక్కించుకున్న పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న దరిమిలా, విడుదలయ్యాక కూడా ఆ పాజిటివ్ టాక్‌ని కొనసాగించి మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.