Table of Contents
‘పడి పడి లేచె మనసు’ (Padi Padi Leche Manasu Preview) అంటూ ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రూపొందింది. ఈ సినిమాకి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకుడు. శర్వానంద్ (Sharvanand) హీరో, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. ప్రోమోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయ్. ఈ స్థాయిలో సినిమాపై హైప్ క్రియేట్ అవడానికి కారణం శర్వానంద్, సాయిపల్లవి ప్రదర్శించిన ఈజ్ అనీ, ఆ ఈజ్‌తోపాటు ఇద్దరి మధ్యా వర్కవుట్ అయిన కెమిస్ట్రీ సినిమాపై అంచనాల్ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాయనీ నిస్సందేహంగా చెప్పొచ్చు.
రొమాంటిక్ ఫీల్‌తో చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే వుంటాయ్. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే, మంచి కథ కుదిరితే.. ఆ సినిమాలు ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతాయ్ అనడానికి చాలా సినిమాలు ఉదాహరణలుగా కనిపిస్తాయ్. ప్రేమ కథల్ని అందంగా తీర్చిదిద్దడంలో దిట్ట అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి అద్భుతమైన నటనతో.. ఈ సినిమా సైతం సంచలన విజయాన్ని అందుకోబోతోందని ప్రీ రిలీజ్ టాక్ విన్పిస్తోంది.
ఫ్లాపులతో ‘సత్తా’ని అంచనా వేయలేరు..
‘నేనూ వరుస ఫ్లాపులిచ్చాను.. ఆ తర్వాత హిట్లు వచ్చాయి కదా..’ అంటూ ఓ ఇంటర్వూలో శర్వానంద్, హను రాఘవపూడిపై తన నమ్మకాన్ని బల్లగుద్ది మరీ చెప్పేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ (LIE) తీవ్రంగా నిరాశపర్చింది. నితిన్ (Nithin), మేఘా ఆకాష్ (Megha Akash) జంటగా వచ్చిన సినిమా అది. అయితేనేం, హను టాలెంట్‌ని ఒక్క ఫ్లాప్ డిసైడ్ చేసెయ్యదు. అతని నుంచి వచ్చిన ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi), ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ (Krishna Gadi Veera Prema Gadha) అలాంటివి మరి.
సెలవుల్లో పండగ చేస్కుందాం..
శర్వానంద్ భలే సరదా మనిషి. పైగా, మెగా కాంపౌండ్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి శర్వానంద్‌కి. తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘అంతరిక్షం’ సినిమా కూడా 21నే విడుదలవుతోందనీ, ఆ సినిమాని సైతం ఆదరించాడని పిలుపునిచ్చాడు ఈ యంగ్ హీరో. ఒకే రోజు రెండు సినిమాలొస్తున్నాయంటే, వాటి మధ్య గొడవలు మామూలే. కానీ, అందుకు భిన్నంగా ‘అన్ని సినిమాలూ ఆడాలి’ అని ఇంకో సినిమాని సపోర్ట్ చేయడం శర్వానంద్‌కే చెల్లిందేమో. సంక్రాంతి సెలవులకు పండగ చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు శర్వానంద్.
సాయి పల్లవి గురించి అదంతా అబద్ధమేనట
కో-స్టార్ సాయిపల్లవి గురించి మాట్లాడుతూ, ఆమె మంచి నటి అనీ.. అంతకు మించి ఆమె మంచి స్నేహితురాలనీ చెప్పిన శర్వానంద్ (Sharwanand), సాయిపల్లవిపై చాలా గాసిప్స్ వున్నాయనీ, అదంతా అర్థం పర్థం లేని ప్రచారమనీ కొట్టి పారేస్తూ.. సాయిపల్లవి డెడికేషన్‌కి ఎవరైనా హేట్సాఫ్ చెప్పాల్సిందేనని స్పష్టం చేశాడు. సాయి పల్లవి డాన్సులకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Stylish Star Allu Arjun) సైతం కితాబులిచ్చిన విషయం తెల్సిందే కదా!
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ‘పడి పడి లేచె మనసు’ (Padi Padi Leche Manasu Preview)
సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వుందట. అదేంటో సినిమా చూస్తేనేగానీ తెలియదట. ఆ సస్పెన్స్ అప్పుడే రివీల్ చేయబోమంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. షూటింగ్ సందర్భంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ, ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఫేస్ చేశామనీ, వాటన్నిటినీ అధిగమించి మంచి ఔట్‌పుట్ తీసుకొచ్చామని ‘పడి పడి లేచె మనసు’ టీమ్ వెల్లడించింది.
ఓ వైపు ‘అంతరిక్షం’, ఇంకో వైపు ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈ క్రిస్‌మస్ వెరీ వెరీ స్పెషల్ కానుంది. రెండు సినిమాలూ హిట్టయి.. ఈ సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళ్ళాడాలని కోరుకుందాం.