Priya Anand About Love.. ప్రియా ఆనంద్ గుర్తుంది కదా.? శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ఎన్నారై భామ.
రానా దగ్గుబాటికీ (Rana Daggubati), ప్రియా ఆనంద్‌కీ అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ్‌కీ.. (Richa Gangopadhyay) ఇదే తొలి సినిమా కూడా.!
‘పటాసు పిల్ల’ అనే స్థాయిలో తొలి సినిమాలో సూపర్బ్ ఎనర్జీతో కనిపించింది ప్రియా ఆనంద్. ఆమె ఈ సినిమాలో చేసిన అల్లరి క్యూటు క్యూటుగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
కానీ, ఎందుకో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ తెలుగు తెరపై సక్సెస్ కాలేకపోయింది. అయితే, తమిళ సినిమాల్లో మాత్రం ప్రియా ఆనంద్ తరచూ సందడి చేస్తూ వస్తోంది.

చాలాకాలం తర్వాత తెలుగునాట ఓ వెబ్ సిరీస్‌తో మళ్ళీ ప్రియా ఆనంద్ సందడి మొదలైంది.
Priya Anand About Love.. ప్రేమంటే.. పెళ్ళంటే.!
ఇదిలా వుంటే, తన పెళ్ళి గురించి ప్రియా ఆనంద్ (Priya Anand) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన ఇంటి పేరు మారకూడదంటే, నిత్యానందను పెళ్ళి చేసుకోవాల్సి వుంటుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించింది ప్రియా ఆనంద్.
నిత్యానంద మీద తానేమీ జోక్ చేయడంలేదనీ, ఆయన ఎలాంటివాడైనప్పటికీ ఆయన్ని ఆరాధించే భక్తులు వేల సంఖ్యలో వున్నారన్నది ప్రియా ఆనంద్ కవరింగ్ డైలాగ్.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
డబ్బు అవసరమే.. కానీ, డబ్బుతోనే అన్ని పనులూ అయిపోవని ప్రియా ఆనంద్ (Priya Anand) చెప్పుకొచ్చింది.

పెళ్ళికి వయసుతో సంబంధం లేదనీ.. మనసు అందంగా వుండాలి తప్ప, చేసుకోబోయేవాడి శారీరక అందం గురించి తాను పట్టించుకోనంటోంది ఈ లీడర్ (Priya Anand Leader) భామ.
అన్నట్టు.. స్మోకింగ్ చేసే మగాళ్ళకంటే తనకు ఇష్టడరనీ.. ఇలా తన ప్రయార్టీస్ గురించి చెప్పింది ప్రియా ఆనంద్ (Priya Anand).