Priya Prakash Varrier Glamshow.. కన్ను కొట్టింది. కొన్ని అవకాశాల్నీ కొల్లగొట్టిందీ.. అయినా స్టార్డమ్ దక్కించుకోలేకపోతోంది. ఒకటీ అరా అవకాశాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది పాపం ఆ ముద్దుగుమ్మ.
ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ.? మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అధార్ లవ్’ అనే మలయాళ సినిమా ప్రోమోతో అమ్మడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఆ సంచలనాలకి పాప ఓ రేంజ్ స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారంతా. కానీ, సింగిల్ నైట్ సెన్సేషన్ అనేది కొన్నాళ్లు మాత్రమే వుంటుందని మరోసారి ఈ బ్యూటీ విషయంలో ప్రూవ్ అయ్యింది.
Priya Prakash Varrier Glamshow. క్రేజ్ వుంటే యూజ్ చేసుకోవల్సిందేగా.!
ప్రోమోతో ఇచ్చిన కిక్కు సినిమాకే లేకపోయింది. ఎలాగోలా.. తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించేసింది. అది కూడా ఒకే హీరో (నితిన్)తో.

అలాగే కొన్ని మళయాల సినిమాల్లోనూ నటించింది. రీసెంట్గా తెలుగులో ‘బ్రో’ సినిమాలో కనిపించింది. అది కూడా హీరోయిన్గా కాదండోయ్.
హీరో సాయి ధరమ్ తేజ్‌కి చెల్లెలి పాత్రలో. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలోనూ ఓ కన్నడ సినిమాలోనూ నటిస్తోంది. అయితే, క్రేజ్‌కి కాస్త యూజ్ చేసుకోవాలిగా.!
Also Read : రష్మిక డీప్ ఫేక్.! ‘దొంగ’ దొరికాడహో.!
సినిమాల సంగతెలా వున్నా.. హాట్ ఫోటో సెషన్స్‌తో సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ అవుతోంది వింక్ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్.
తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో బ్రైట్ గ్లామరస్ పోజులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. అందాల ‘వల’తో మెరిసిపోతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.

ఎంత కష్టపడినా ఏం లాభం.! ప్రియా ప్రకాష్ వారియర్‌ని మేకర్లు బొత్తిగా పట్టించుకోరే.! అయినా కానీ, గుడ్ టైమ్ కోసం వెయిట్ చేస్తోంది.
అందాకా తన వంతు అందాల ప్రదర్శనతో నెట్టింట ఇదిగో ఇలా ట్రెండింగ్ అవ్వాలని చూస్తోంది వైరల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.