Table of Contents
అందాల పోటీలు, బాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడేమో గ్లోబల్ స్టార్ ఇమేజ్.. ఇవన్నీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra Me Too) గురించే. హాట్ బ్యూటీ.. అనిపించుకోవడానికి ప్రియాంకా చోప్రా, సినిమాల్లో చాలా చాలానే చేసేసింది. బికినీల్లో హొయలొలికించేసింది.. హాట్ హాట్ స్పెషల్ సాంగ్స్.. చెప్పుకుంటూ పోతే, కథ పెద్దదే.
‘స్విమ్మింగ్ చేయాలంటే, స్విమ్ సూట్ వుండాలి కదా.. చీర కట్టుకుని స్విమ్మింగ్ చేయడం కష్టం కదా..’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది ప్రియాంకా చోప్రా. పాత్ర కోసం అవసరమైతే అన్నీ చేయాలి.. లిప్ కిస్ లాంటివి కూడా తప్పవ్.. అని కూడా ఈ బ్యూటీనే సెలవిచ్చింది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం.. ఏం చేసినా తప్పు లేదనీ ఇదే ప్రియాంక సెలవిచ్చింది.
ప్రియాంక చోప్రా తొలి కష్టం..
కానీ, కెరీర్ తొలి నాళ్ళలో ఓ దర్శకుడు తనను తీవ్రంగా ఇబ్బంది (Casting Couch) పెట్టాడనీ, పొట్టి పొట్టి డ్రస్సులేసుకోమని వేధించడంతోపాటుగా, తన వక్షోజాల్ని పెద్దగా చేసుకోవడానికి సర్జరీని ఆశ్రయించాలని ఒత్తిడి చేశాడనీ తాజాగా ప్రియాంకా చోప్రా (Priyanka Chopra Me Too) తన బయోగ్రఫీలో ఆనాటి ఆ విషయాల్ని వెల్లడించి పెను సంచలనానికే తెరలేపింది.
అయితే, ఆ సమయంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) తనకు అండగా నిలిచాడని కూడా ప్రియాంక చెప్పింది. ‘నువ్వు సినిమాల్లో చేసిందేంటి.? ఇప్పుడు మాట్లాడుతున్నదేంటి.?’ అని కొందరు నెటిజన్లు ప్రియాంకని ప్రశ్నిస్తున్నారు. జుగుప్సాకరమైన విమర్శలూ ప్రియాంక మీద చేస్తున్నారు.
తప్పు ప్రియాంక చోప్రాది కాదు..
మరోపక్క, ప్రియాంకకు (Priyanka Chopra Jonas) మద్దతు కూడా బాగానే వస్తోంది. ఆ డైరెక్టర్ మీద కేసు పెట్టాలంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. ‘సినిమాల్లో నటించే సమయంలో కథకు అనుగుణంగా నటీనటులు తమ ఇష్టం మేరకు ఏం చేసినా అది తప్పు కాదు.
కానీ, నటీనటులకు ఇష్టం లేకుండా వస్త్ర ధారణ సహా రొమాంటిక్ సన్నివేశాల్లో (Priyanka Chopra Me Too) నటించడంపై దర్శకులు, తోటి నటీనటులు, నిర్మాతలు ఒత్తడి తెస్తే అది నేరమే.. అన్నది చాలామంది అభిప్రాయం.
పబ్లిసిటీ స్టంటేనా..?
ఎవరి గోల వారిదే. ఏది తప్పు.? ఏది ఒప్పు.? ఏది పబ్లిసిటీ స్టంటు.? ఏది నిజమైన ఆవేదన.? అన్న విషయంలో మళ్ళీ భిన్నాభిప్రాయాలుంటాయి. ‘మీ టూ’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. కాస్టింగ్ కౌచ్ రగడ తారాస్థాయికి చేరింది.. కానీ, ఆ రెండూ ఆ తర్వాత చల్లారిపోయాయి. ఇప్పుడు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రగడ కూడా అంతేనేమో.
