Table of Contents
Priyanka Mohan Ai-Generated OG.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బొమ్మలు కొన్ని అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా.
దేవతల బొమ్మలు, వాటితో చేసే వీడియోలే కాదు.. సెలబ్రిటీల్ని కూడా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో.
కుప్పలు తెప్పలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో, ఎవరైనా తేలిగ్గా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బొమ్మలు, వీడీయోలు చేసెయ్యగలుగుతున్నారు.
Priyanka Mohan Ai-Generated OG.. బాధితురాలిగా మారిన ప్రియాంక మోహన్
ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించింది నటి ప్రియాంక మోహన్. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది.
అయితే, ఆ సినిమా షూటింగ్ స్పాట్‌కి చెందిన ఫొటోలుగా పేర్కొంటూ, కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌ని కొందరు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తున్నారు కొందరు.
ఎక్కడా, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలుగా అనిపించడంలేదంటే, ఏఐ ఎంత పెర్‌ఫెక్ట్‌గా ఆ ఫొటోల్ని డిజైన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఎథిక్స్ పాటించే క్రమంలో, ఆ ఫొటోల్ని ఇక్కడ చూపించదలచుకోలేదు. కానీ, అవి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక..
కాగా, ఎథికల్ క్రియేటివిటీ కోణంలో మాత్రమే ఐఏ అనే సాంకేతికను వినియోగించాలనీ, దుష్ప్రచారానికి వినియోగించకూడదని ప్రియాంక మోహన్ పేర్కొంది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రియాంక మోహన్, ఏఐ జనరేటెడ్ ఫొటోలు సర్క్యులేట్ అవడంపై స్పందించింది.
Some AI-generated images falsely depicting me have been circulating. Please stop sharing or spreading these fake visuals.
AI should be used for ethical creativity and not misinformation. Let’s be mindful of what we create and what we share. Thank you.
ఇదీ ప్రియాంక మోహన్ స్పందన. సో, బాధ్యతగా వ్యవహరించండి.. ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌ని సర్క్యులేట్ చేయకండి.
మీ ఇంట్లోకి కూడా వచ్చేసింది..
కేవలం సెలబ్రిటీలే ఇలా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కారణంగా ఇబ్బంది పడతారనుకుంటే అది పొరపాటు. మన ఇళ్ళల్లోకి కూడా వచ్చేస్తుందది.
మన ఇంట్లోని మహిళలకు ఇదే పరిస్థితి వస్తే.? అన్న కోణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి వుంది. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ విషయంలో.
వచ్చేస్తుంది కాదు.. ఆల్రెడీ వచ్చేసింది.! సో, జర జాగ్రత్త.!
