Table of Contents
Priyanka Mohan OG Promotions.. ప్రియాంక అరుల్ మోహన్ వచ్చేసింది.! ‘ఓజీ’ సినిమా ప్రమోషన్లు షురూ చేసేసింది.!
సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఓజీ’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఓ వైపు సుజీత్, ఇంకో వైపు సంగీత దర్శకుడు తమన్.. ‘ఓజీ’ కోసం చేస్తున్న డ్యూటీ ఓ లెవల్‌లో వుంది.
Priyanka Mohan OG Promotions.. తమన్ సంచలనం..
ఇప్పటిదాకా తమన్ చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు.. ‘ఓజీ’ ఒక్కటీ ఇంకో ఎత్తు.! ఔను, ఆ స్థాయిలో తమన్, ‘ఓజీ’ కోసం మ్యూజిక్ కొట్టాడు.
ఆ కొట్టడం కూడా అలా ఇలా కాదు.. విడుదలవుతున్న ప్రతి సాంగ్, అంతకు మించిన సంచలనాల్ని సృష్టించేస్తుండడం గమనార్హం.

పవన్ కళ్యాణ్‌కి తమన్ వీరాభిమాని.. అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ వీరాభిమానం, ‘భక్తి’గా మారిపోయిందిప్పుడు.
సినిమా చూడలేదుగానీ..
‘సినిమా పూర్తయ్యాక.. మొత్తం సినిమాని నేనింకా చూడలేదు. చూసిన సీన్స్ మాత్రం వేరే లెవల్‌లో వుంటాయ్..’ అని ప్రియాంక మోహన్, తాజాగా వెల్లడించింది.
‘బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో నాకూ కొన్ని సీన్స్ వున్నాయి. తెరపై ఆ సీన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తాయ్..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్.

ఇమ్రాన్ హష్మీ, ‘ఓజీ’లో ‘ఓమీ’ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘ఓమీ’ పాత్రని పరిచయం చేస్తూ, ఆ పాత్రతోనే పవన్ కళ్యాణ్‌కి మొన్నీమధ్యనే బర్త్ డే విషెస్ చెప్పించింది ‘ఓజీ’ టీమ్.!
పవన్ కళ్యాణ్ మళ్ళీ సిగ్గు పడాల్సిందేనేమో..
‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రమోషన్ల కోసం నిధి అగర్వాల్ పడ్డ కష్టం గురించి పదే పదే ప్రస్తావిస్తూ, ‘ఆమెని చూసి సిగ్గు తెచ్చుకున్నా’ అని పలు వేదికలపై పవన్ కళ్యాణ్ చెప్పడం చూశాం.
ఇప్పుడేమో ‘ఓజీ’ కోసం ప్రియాంక మోహన్ ‘డ్యూటీ’ షురూ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా, సినిమా ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగాల్సి వుంది.
Also Read: Anushka Shetty Ghaati Review: గంజాయి స్మగ్లింగ్.. రివెంజ్ డ్రామా.!
అలా దిగితే, ఇంకోసారి పవన్ కళ్యాణ్ ‘ఆమెని చూసి సిగ్గు తెచ్చుకున్నా..’ అని ప్రియాంక మోహన్ గురించి ప్రస్తావిస్తారేమో.. అని సెటైర్లేస్తున్నారు నెటిజనం.
సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు పడవల ప్రయాణం.. పవన్ కళ్యాణ్‌కి కష్టసాధ్యమైన పనే. అయినా, సమర్థవంతంగా రెండు బాధ్యతల్నీ నిర్వహిస్తున్నారాయన.