Protocol In Hindu Temples.. దేవుడి ముందర అందరూ సమానమే కదా.? మరి, ‘ప్రోటోకాల్’ ఎందుకు.?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రముఖ దేవాలయంలో అయినా సరే, ‘ప్రోటోకాల్’ అనే ఓ విభాగం తగలడుతుంది.! ‘ప్రోటోకాల్ ఆఫీసులు’ కూడా తెరుస్తున్నారు.
దేవుడి పేరుతో చేసే వ్యాపారం.. గురించి కొత్తగా చెప్పేదేముంది.? శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం.. అంటూ, హిందువుల్ని నిలువునా దోచేస్తున్నాయి దేవాలయాలు.
దేవాలయాలు కాదు, దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో.. ప్రభుత్వమే, హిందువుల్ని దోపిడీ చేస్తోంది. ఇది బహిరంగ రహస్యం.
భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో, జైళ్ళను తలపించేలా క్యూ లైన్లను నిర్మించడం చాలాకాలంగా జరుగుతోంది. ఆ క్యూ లైన్లలో సాధారణ భక్తులు నరకం అనుభవిస్తున్నారు.
దైవ దర్శనానికి వెళ్ళే సాధారణ భక్తులు, ఈ దిక్కుమాలిన క్యూ లైన్లు, ప్రోటోకాల్స్.. శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల వల్ల, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు.
Protocol In Hindu Temples.. ప్రోటోకాల్.. భక్తుల్ని వేధించడానికేనా.?
బహుశా, ప్రభుత్వాలు ఈ ఉద్దేశ్యంతోనే హిందూ దేవాలయాల్ని ప్రోటోకాల్ పేరుతో, శీఘ్ర అతి శీఘ్ర దర్శనాలతో, వీఐపీ దర్శనాలతో.. పక్కదారి పట్టిస్తున్నాయేమో.!
సర్పంచ్ నుంచి రాష్ట్రపతిదాకా.. చిన్నా చితకా ఉద్యోగి నుంచి, ఉన్నతాధికారులదాకా.. ప్రోటోకాల్ పేరుతో, సామాన్య భక్తులకి దేవుడ్ని దూరం చేస్తున్నారు హిందూ దేవాలయాల్లో.
చాలాకాలంగా జరుగుతున్న తంతు ఇది.! అదేమని ప్రశ్నిస్తే, భక్తులపై ‘సిబ్బంది’ దాడులు చేసిన సందర్భాలూ లేకపోలేదు.
దేవాలయాల్లో తొక్కిసలాటలకి ఈ ప్రోటోకాల్, వీఐపీ, వీవీఐపీ దర్శనాలే కారణమన్నది బహిరంగ రహస్యం. దేవాదాయ ధర్మాదాయ శాఖ.. ఆర్జన మీద పెట్టిన దృష్టి, భక్తుల విశ్వాసాల మీద పెట్టడంలేదు.
వెరసి.. దేవాలయాల్లో ప్రోటోకాల్ విషయమై ‘గుడి’సేటి ప్రోటోకాల్.. అన్న భావన భక్తుల్లో పెరిగిపోతోంది.
దేవాలయాల యందు ప్రోటోకాల్ దేవాలయాలు వేరయా.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
ఆ ప్రోటోకాల్ వ్యక్తుల కోసం, వీవీఐపీ బక్తుల కోసం, శీఘ్ర అతి శీఘ్ర దర్శనాల కోసం.. వేరే దేవాలయాలు నిర్మించుకోవడం బెటర్. అదీ, వాళ్ళు ఇచ్చే విరాళాలతో.
Also Read: అదృష్ట దేవత: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
ఖాకీ దుస్తులేసుకుని, దేవాలయాల్లో డ్యూటీలు చేస్తోంటే, అలాంటివారిని చూసే భక్తులకి.. ఎంత చికాకు కలుగుతుందో ఎప్పుడైనా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలోచించిందా.?
అసలు దేవాలయాల్లో ‘ప్రోటోకాల్’ అనే దిక్కుమాలిన పద్ధతిని తీసుకొచ్చింది ఎవరు.? ఖచ్చితంగా హిందువు అయితే అయి వుండరు.!
అన్యమతస్తులు హిందూ ధర్మంపై దాడి కోసం ‘ప్రోటోకాల్’ అనే ఆలోచన చేసి వుంటారేమో.!
హిందువులెవరైనా.. ఎంతటి ఉన్నత పదవిలో వున్నా, ప్రోటోకాల్ ఆలోచన చేయకుండా, సామాన్య భక్తుల్లా దైవ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది. హిందువులుగా అది వారి బాధ్యత.
