Punch The Little Monkey.. కోతి చేష్టలు.. అనే మాట చాలామంది వినే వుంటారు.! గోడ మీద నుంచి దూకినా.. చెట్లెక్కినా.. ఏ చిలిపి పని చేసినా, ‘కోతి చేష్టలు’ అనడం సర్వసాధారణం.
ఇప్పుడంటే, వైరల్.. అనే మాటకి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది గనుక, అన్నిటినీ అందులో వేసేస్తున్నాం.
దేన్నయినాసరే, వైరల్ చేసేస్తాం.! అసలు మనం ఏం చేసినా, అది వైరల్ అయిపోవాలని కోరుకుంటున్నాం. ఈ క్రమంలోనే వైరల్ కంటెంట్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
కోతి నైైజం.. కోతి చేష్టలు చేయడం.! పైగా, అది పిల్ల కోతి.! ఇకనేం, దాని చేష్టలు వేరే రేంజ్‌లో వుంటాయ్. అవి కెమెరాలో బంధిస్తే, వాటిని వైరల్ చెసేస్తే, ఆ కిక్కే వేరప్పా.!
జూలో పిల్ల కోతి వేషాలు..
ఓ ‘జూ’లో కోతికి పిల్ల పుట్టింది. పుట్టాక, ఆ పిల్లని దూరం పెట్టింది తల్లి కోతి.! పిల్ల కోతి పాపం డీలా పడింది. అమాయకంగా, ఆ ‘జూ’లోనే తల్లి చుట్టూ తిరుగుతూ వుంది.
తల్లేమో, పిల్ల కోతిని పట్టించుకోవట్లేదు. దగ్గరకు వచ్చిన పిల్ల కోతిని, తల్లి కోతి దూరంగా తోసేసింది. ఈ క్రమంలో పిల్ల కోతికి ఓ టెడ్డీ బేర్ అందించారు ‘జూ’ సిబ్బంది.

కోతికి కొబ్బరికాయ దొరికితే.. అనే సామెత వుండనే వుంది కదా.! ఇక్కడ ఏకంగా కోతి పిల్లకి, కోతి లాంటి టెడ్డీ బేర్ దొరికేసింది. అంతే, దానితో ఆటలు మొదలెట్టింది.
కోతి పిల్లకి ‘పంచ్’ అనే పేరు పెట్టి, వీడియోలు వైరల్ చేయడం మొదలెట్టారు. ప్రపంచమంతా ఈ వీడియోలు చూసి ముచ్చట పడ్డమే కాదు, కంటతడి పెట్టడం గమనార్హం.
తల్లి ప్రేమకి దూరమయ్యాడు పంచ్ గాడు..
‘పాపం పంచ్ గాడు.. తల్లి ప్రేమకు దూరమయ్యాడు..’ అంటూ, చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ వీడియోల్ని వైరల్ చేసి పారేశారు.
జంతువులు కఠిన వాతావరణంలో పెరుగుతాయి.. తమ పిల్లలకి జంతువులు అన్ని ఇబ్బందుల్నీ అలవాటు చేస్తాయి. కోతి పిల్ల ‘పంచ్’ విషయంలో కూడా జరిగింది అదే.
ఇది ప్రకృతి ధర్మం.! ఇందులో వింతేమీ లేదు. తల్లి కోతి, ఆ తర్వాత పిల్ల కోతిని దగ్గరకు తీసుకుందనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
కొన్ని జీవులు అయితే, తమ పిల్లల్ని చేజార్చుకున్నప్పుడు, తిరిగి వాటిని అస్సలు దగ్గరకి చేరనివ్వవు. వాటి కారణాలు వాటికి వుంటాయి.
ఏది ఏమైనా, లిటిల్ మంకీ పంచ్ గాడు.. ప్రపంచాన్ని కదిలించేశాడు. వైరల్ ప్రపంచమిది.. ఇక్కడింతే.!
