Puneeth Rajkumar.. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 46 ఏళ్ల అప్పూ (పునీత్ రాజ్ కుమార్‌ని అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు) గుండె పోటుతో హఠాన్మరణం చెందడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలేం జరిగింది.? ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ ఉన్నపలంగా గుండెపోటుతో ప్రాణం కోల్పోవడమేంటీ.? ఆయనకు మధుమేహం లేదు. రక్తపోటు సమస్యా లేదు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. నిత్యం వ్యాయామం చేస్తుంటాడు. వ్యాయామం తాలూకు అవసరం ఏంటో అందరికీ చెబుతాడు అప్పు.
వైద్యులకే అంతు పట్టని సమస్య.
రాజ్‌కుమార్ అంటే, కన్నడ సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్. ఆ సూపర్ స్టార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ వైద్యుడు ఈ ఘటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒంట్లో నలతగా ఉందని తన వద్దకు పునీత్ రాజ్ కుమార్ వచ్చాడనీ, ఈసీజీ చేసి చూడగా చిన్న స్ర్టెయిన్ కనిపించిందనీ, వెంటనే ఐసీయూకి తరలించేలా ఏర్పాట్లు చేశామనీ అన్నారు.

మెరుగైన వైద్య చికిత్స కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించామనీ, ఇంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయిందనీ పునీత్ రాజ్ కుమార్ మరణంపై వైద్యుడు వెల్లడించారు. ఆసుప్రతికి వచ్చేసరికే అపస్మారక స్థితిలో పునీత్ రాజ్ కుమార్ ఉన్నారనీ, ఎంత శ్రమించినా ఆయన ప్రతిస్పందించలేదనీ, ఆయన మరణాన్ని ధృవీకరించిన వైద్యులు చెప్పారు.
Puneeth Rajkumar.. అతి వ్యాయామం కొంప ముంచిందా.?
సోషల్ మీడియాలో పునీత్ మరణంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. కొన్ని మీడియా సంస్థలు బోలెడన్ని చర్చలు పెడుతున్నాయ్. కానీ, శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు.. విధి రాత అంతే. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం పునీత్ రాజ్ కుమార్ స్వయంగా చెప్పారు.
Also Read: రుధిర జర్నలిజం.. బైక్ స్పీడు గంటకి 400 కిలోమీటర్లు.!
అసలు అనారోగ్య సమస్యలేమీ లేని వ్యక్తి గుండె సంబంధిత ఇబ్బందులు లేని వ్యక్తి హఠాన్మరణం చెందడం ‘విధి రాత’ మాత్రమే. దీనికి పెడార్ధాలు తీయడం సమంజసం కాదు.
ఒక్కటి మాత్రం నిజం. పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) చాలా చాలా చాలా మంచోడు. ఆ మంచితనం బహుశా దేవుడికే కంటగింపుగా మారిందేమో. ఆయన్ని దేవుడుగా భావించి ఆయన ద్వారా ఆర్ధిక సాయం పొందుతున్న చాలా మందికి కష్టం కలిగించాలని దేవుడిలా చేశాడేమో.