Home » సినిమా రివ్యూ: రొమాంటిక్.. పూరి ‘మార్కు’ ఇంతే.!

సినిమా రివ్యూ: రొమాంటిక్.. పూరి ‘మార్కు’ ఇంతే.!

by hellomudra
0 comments
Romantic Cinema Review

Cinema Review Romantic.. పూరి ఆకాష్ మంచి నటుడే.. కానీ, సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోతున్నాడు. వయసుకు మించిన బరువైన పాత్రలు చేసేస్తున్నాడు. బాల నటుడిగానే తనదైన ముద్ర వేసిన పూరి ఆకాష్, తాజాగా ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో రొమాంటిక్ డోస్ చాలా ఎక్కువైపోయిందని ప్రోమోస్‌తోనే అందరికీ అర్థమయిపోయింది.

తొలి తెలుగు సినిమా ‘రొమాంటిక్’తో అస్సలేమాత్రం మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చేసేసింది కేతిక శర్మ. ఆమె అంద చందాలే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలయ్యాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. కేవలం కేతిక గ్లామర్ కోసమే థియేటర్లకు తొలి రోజు ప్రేక్షకులు వచ్చారనడం అతిశయోక్తి కాదేమో.

Romantic కథా కమామిషు..

‘రొమాంటిక్’ కథా కమామిషు ఏంటంటే, ఓ కుర్రాడు.. డబ్బు కోసం ఏదైనా చేసేస్తాడు.. అతనికో అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెపై మోహం పెంచుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అతనికి కనెక్ట్ అయిపోతుంది. ఇద్దరి మధ్యా ‘మోహం’ పెరిగిపోతుంది.. కామ కోరికలతో రగిలిపోతుంటారు.

Romantic Cinema Review
Romantic Cinema Review

అబ్బే, అది మోహమో.. కామమో కాదు, ప్రేమ.. అని ఓ పోలీస్ అధికారిణి వారికి తెలియజేస్తుంది. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్యనున్నదేంటి.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు ఇదేం కథ.? ఔను, ఇది కథే. నమ్మాల్సిందే. దర్శకుడు అనిల్ పాడూరి అయినా, కథ అలాగే మాటలు, స్క్రీన్ ప్లే.. అన్నీ పూరి జగన్నాథ్‌వే.

Cinema Review Romantic పూరి మార్కు వుంది.. స్పార్క్ ఏదీ.?

సినిమాలో ప్రతి ఫ్రేమ్.. పూరి జగన్నాథ్ మార్కుతోనే వుంటుంది. దురదృష్టమేంటంటో, ఒకప్పటి పూరి స్పార్క్.. ఇప్పుడు అతని సినిమాల్లో కనిపించడంలేదు. గన్నులు, యాక్షన్ సన్నివేశాలు, మాఫియా.. ఇలానే నడుస్తున్నాయి ఆయన నుంచి వచ్చే సినిమాలు. ఇందులోనూ అవే వున్నాయ్.

Also Read: కేతిక శర్మ ‘రొమాంటిక్’ న్యూ యాంగిల్.!

తనవరకూ పూరి ఆకాష్ చాలా బాగా చేసినట్టే. కేతికకి అప్పజెప్పిన అందాల ప్రదర్శన.. అనే బాధ్యతను అస్సలేమాత్రం మొహమాటపడకుండా నిర్వర్తించేసింది. నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికేమీ లేదు. రమ్యకృష్ణ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్.. కానీ, ఆమె కూడా ఈ సినిమా కోసం అదనంగా చేయగలిగిందేమీ లేకుండా పోయింది.

పూరి సినిమాలంటే అంతేనా.?

పూరి మార్కు డైలాగులు కొన్ని ఆకట్టుకుంటాయి. రొమాన్స్, యాక్షన్.. ఇవి తప్ప, సినిమాలో ప్రత్యేకించి మాట్లాడుకోవడానికేమీ లేవు. పాటలు ఓకే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు బావున్నాయ్.

దర్పూశకుడు పూరి జగన్నాథ్ ( Cinema Review Romantic ) నుంచి ఓ మంచి లవ్ స్టోరీ.. అదీ ఆకాష్ హీరోగా వస్తే.. అన్న ఆలోచన మర్చిపోవాలేమో. సెన్సిబుల్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుల చేతిలో పడితే, ఆకాష్ మరింత రాటుదేలుతాడు.

BeeyeS

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group