Puri Jagannadh Vijay Sethupathi.. దర్శకుడు పూరి జగన్నాథ్ ఎక్కడుంటే, నిర్మాత ఛార్మి కౌర్ అక్కడుండాల్సిందే.!
పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్.. ఈ ఇద్దరూ సంయుక్తంగా ‘పూరి కనెక్ట్స్’ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, వరుస పరాజయాల నేపథ్యంలో ‘పూరి కనెక్ట్స్’ నుంచి ఛార్మి తప్పుకుందనీ, దర్శక నిర్మాతగా పూరి కనెక్ట్స్ నుంచి పూరి జగన్నాథ్ సోలోగా ఓ సినిమా తెరకెక్కించనున్నారనీ ప్రచారం జరిగింది.
Puri Jagannadh Vijay Sethupathi.. ప్రచారమిదీ.. నిజం ఇదీ.!
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తారన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
ఈ ప్రచారంలో కొంత నిజం వుంది. అదేంటంటే, పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో సినిమా. ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన కూాడా వచ్చింది.
అయితే, పై ప్రచారంలో అబద్ధం కూడా లేకపోలేదు. అదే, పూరి కనెక్ట్స్ నుంచి ఛార్మి కౌర్ తప్పుకోవడం. నిజానికి, ఆమె తప్పుకోలేదు.
ఛార్మి లేకపోతే ఎలా.?
ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి.. ఈ ముగ్గురూ వున్న ఫొటో, పూరి కనెక్ట్స్ నుంచి ఉగాది రోజున బయటకు వచ్చింది. అద్గదీ అసలు సంగతి.
పూరి – ఛార్మి కాంబినేషన్‌లోనే, ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సెన్సేషనల్ కమర్షియల్ హిట్టు సినిమా వచ్చింది.! ఇదే కాంబినేషన్‌లో కొన్ని డిజాస్టర్లు కూడా వచ్చాయ్.!
ఛార్మి లేకపోతే, పూరి లేడు.. అన్నది నిజమేనా.? ఆ సంగతేమోగానీ, ఇద్దరి కాంబినేషన్‌లో అయితే, సినిమాలు ముందు ముందు కూడా వస్తాయ్.. అదీ, ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌లో.!
Als Read: అదిదా సర్‌ప్రైసు: కేతికని కత్తిరించేశారహో.!
అన్నట్టు, పూరి – చార్మి కాంబినేషన్‌లో (నటిగా ఛార్మి, దర్శకుడిగా పూరి) గతంలో జ్యోతి లక్ష్మి పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్, చాలా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడట.. కథ విషయంలో.