Table of Contents
Pushpa The Rise Garikapati.. సినిమా అంటే అదో వినోదం. అదో కళ. కథను బట్టీ, అందులోని పాత్రల తీరు తెన్నులను బట్టీ ఆ సినిమా రూపొందించిన వారిపైనో, సినిమాలో నటించిన నటీ నటుల గురించో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. సినిమా బాగుందా.? లేదా.? అన్నది కాదిక్కడ చర్చ. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందరూ మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
Pushpa The Rise Garikapati.. ఈ ప్రవచనాల గోలేంటి మహాప్రభో.!
ఈ తరుణంలో ‘పుష్ప’ సినిమాలో హీరో పాత్ర గురించి ఓ సిద్ధాంతి ప్రవచనాలు చెబుతున్నారు. సినిమాలో హీరో స్మగ్లర్ అనీ, అసలు హీరో పాత్రని అలా ఎలా చూపిస్తారు.? అని అంటున్నారు ప్రవచన కర్త గరికపాటి.
సినిమా అంతా హింస, నేరాలు చూపించి చివరలో చిన్న మంచి చూపించేస్తామంటే ఇదెక్కడి న్యాయం.? అని గరికపాటి వాపోతూ నిలదీసేశారు. హీరో ద్వారా ‘తగ్గేదే లె’ అనే డైలాగ్ చెప్పించడం నేరాల్ని ప్రోత్సహించడమే అని గరికపాటి ప్రవచించారు.
రీల్ వర్సెస్ రియల్.. ఆ తేడా తెలీదా.?
అన్నట్లు గరికపాటికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గరికపాటి పండితుడు. ప్రవచన కర్త. కానీ, ఆయన సినిమా గురించి ఇంత తేలికైన వ్యాఖ్యలు ఎలా చేయగలిగినట్లు.?

ముందే చెప్పుకున్నాం కదా.. సినిమా అనేది వినోదం కోసం. సమాజాన్ని ఉద్దరించడానికి కాదు. సరే, సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి, దాని ద్వారా మంచి చెప్పాలని అనుకుని ఆర్ట్ సినిమాలు తీయాలని ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే, వాళ్లని అభినందించాల్సిందే.
కానీ, సినిమా ఇలాగే వుండాలని ఎవరూ సూత్రీకరించలేరు. ‘పుష్ప’ సినిమా చూసి హత్యలు చేస్తారనో, స్మగ్లర్లు అయిపోతారనో భావిస్తే, అలాంటి వారికి సమాజం పట్ల కనీసపాటి అవగాహన లేదనే అనుకోవాలేమో.
పుష్ప.. అల్లు అర్జున్ రేంజ్ పెంచేసిన సినిమా.!
గరికపాటి ప్రవచనాల సంగతి పక్కన పెడితే, అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ‘పుష్ప’ నిలిచింది. అంతకు ముందు తన సినిమాల హిందీ వెర్షన్లతో యూ ట్యూబ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లు అర్జున్, ఈసారి నేరుగా మల్టీ లింగ్వల్ సినిమా తరహాలో ‘పుష్ప’తో వివిధ భాషల్లో సత్తా చాటేశాడు.
Also Read: సీతాకోక చిలుక ‘ముద్దు’: ఇది మీకు తెలుసా.?
హిందీ వెర్షన్ ‘పుష్ప’ అయితే అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ‘పుష్ప’ మేనియా ఏ స్థాయిలో వుందంటే, అసలు ఇండియన్ లాంగ్వేజెస్ ఏవీ తెలియని వారు కూడా ‘పుష్ప’ సినిమాలోని పాటల్ని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్.. తదితర సోషల్ మీడియా వేదికల సాక్షిగా రీల్స్ చేసి పారేస్తున్నారు.
ప్రభాస్ తర్వాత సౌత్ సినిమా నుంచి బాలీవుడ్‌లో ఆ స్థాయి రేంజ్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడనడం అతిశయోక్తి కాదేమో. అయితే, ఇదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని విమర్శలు చేసేవారూ వున్నారనుకోండి.. అది వేరే సంగతి.