Raashi Khanna BW Beauty..పేరులోనే రాశులు పోగేసింది. ఇక, ఆ రాశికి అందం కూడా జోడిస్తే.. ఆమెనే అందాల రాశి ఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.
అంతకు ముందే హిందీలో ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమాలో నటించింది రాశీ ఖన్నా. అయితే, తెలుగులో మొదటి సినిమానే సక్సెస్ అయ్యేసరికి గోల్డెన్ బ్యూటీ అయిపోయింది.
తొలి సినిమాకే కుర్రకారును జోరెత్తించేసింది. అన్నట్లు ‘జోరు’ సినిమా రాశీఖన్నాకి తెలుగులో తొలి సినిమా అండోయ్.
Raashi Khanna BW Beauty .. అప్పుడే టాలెంట్ చూపించింది.!
అయితే, ‘ఊహలు గుసగుసలాడే’ మొదట రిలీజ్ అయ్యింది. ‘జోరు’ సినిమా కోసం రాశీ ఫాప పాట కూడా పాడేసింది. అదే టైటిల్ సాంగ్.
కేవలం నటి మాత్రమే కాదు రాశీఖన్నా.. మంచి సింగర్ కూడా. సో వస్తూ వస్తూనే ఆ టాలెంట్ చూపించేసింది. అయితే, హీరోయిన్‌గా బిజీ అయిపోవడంతో సింగింగ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు ఆ తర్వాత.

‘జిల్’, ‘శివమ్’, ‘బెంగాల్ టైగర్’, ‘పండగ చేస్కో’, ‘తొలిప్రేమ’, ‘సుప్రీమ్’.. ఇలా బోలెడన్ని విజయవంతమైన సినిమాల్లో నటించింది రాశీఖన్నా.
తెలుగుతో పాటూ, తమిళ తదితర భాషల్లోనూ రాశీఖన్నా నటించింది. ‘థాంక్యూ’ సినిమా తర్వాత రాశీఖన్నా తెలుగు సినిమాలు కాస్త తగ్గించింది.
బ్లాక్ అండ్ వైట్ నాజూకు అందాలు..
ప్రస్తుతం హిందీలో బిజీగా వుంది. అక్కడ వెబ్ కంటెంట్‌తోనూ రాశీఖన్నా పండగ చేసుకుంటోంది. అలాగే తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో వున్నాయ్.
తాజాగా సోషల్ మీడియాలో రాశీ ఖన్నా స్పెషల్ ఫోటో షూట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లాక్ అండ్ వైట్‌లో హాట్ అప్పీల్ ఇస్తున్న పిక్స్ అవి.
Also Read: ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?
మొదట్లో కాస్త బొద్దుగా ముద్దుగా వున్నట్లు కనిపించిన రాశీఖన్నా ఆ తర్వాత కష్టపడి వర్కవుట్లు చేసి నాజూగ్గా సన్నజాజి నడుమందాలతో కుర్రోళ్లకు కొత్త కిక్కిచ్చింది.
తాజా పోజుల్లో రాశీఖన్నా నాజూకు అందాలు కుర్రోళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్.