Radhe Shyam Prabhas Review: ప్రభాస్.. నిజంగానే అందరికీ డార్లింగ్.! ‘బాహుబలి‘ చేసినా, ‘సాహో’ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నా, ఇప్పుడు ‘రాధేశ్యామ్’తో సరికొత్త ప్రయోగం చేసినా.. అవన్నీ ప్రభాస్‌కే చెల్లుతాయేమో.!
‘అబ్బే.. ఇలా చేసి వుండకూడదు..’ అంటూ ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ సినిమా విషయమై చాలామంది పెదవి విరిచారు. ప్రతి సినిమా ‘బాహుబలి’ ఎందుకవుతుంది.? హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపించాడు ‘సాహో’ సినిమాలో ప్రభాస్.!
Radhe Shyam Prabhas Review.. దటీజ్ ప్రభాస్.!
ఇప్పుడేమో, ‘లవ్ స్టోరీ చేయడం ఈ సమయంలో సబబు కాదు..’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కానీ, హస్త సాముద్రికం అనే కాన్సెప్టుతో సినిమా చేయాలన్న ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం.. ఈ విషయంలో ప్రభాస్‌ని అభినందించి తీరాల్సిందే.
ప్రభాస్ – పూజా హెగ్దే ‘లవ్ స్టోరీ’ (Prabhas Pooja Hegde Love Story) అదిరింది.. ‘రాధేశ్యామ్’ ద్వారా సరికొత్త ప్రభాస్‌ని చూస్తున్నామన్న భావన సినిమా చూసిన చాలామందిలో కనిపిస్తోంది. కానీ, ‘బాహుబలి’ (Baahubali) స్థాయిలో లేదు, ‘సాహో’ (Saaho) స్థాయిలో మాస్ ఎలిమెంట్స్ లేవు.. అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
ప్రయోగాత్మక సినిమాలు వచ్చి తీరాల్సిందే.!
తెలుగు తెరపై ప్రయోగాత్మక సినిమాలు రావాలి.! సినిమా సినిమాకి రెమ్యునరేషన్, బడ్జెట్ పెరగడం కాదు.. క్వాలిటీ ముఖ్యమిక్కడ. ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో ఈ క్వాలిటీ గురించే ఎక్కువమంది చర్చించుకుంటున్నారు.
‘సాహో’కి వచ్చిన విమర్శల నేపథ్యంలో మామూలుగా అయితే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (Radhe Shyam Review) చేసి వుండకూడదు.
Also Read: Pawan Kalyan హీరోయిజంపై ఎందుకీ ‘ఏడుపు’.!
అయినాగానీ, చేశాడంటే.. సినిమా పట్ల అతనికి వున్న ప్యాషన్ ఏంటో అర్థమవుతుంది. అందరు హీరోల అభిమానులూ ప్రభాస్ సినిమా హిట్టవ్వాలని కోరుకున్నమాట వాస్తవం.
కానీ, కొందరు దురభిమానుల కారణంగా ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమాపైనా నెగెటివిటీ షురూ అయ్యింది. ఇది మన తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా.!
‘రాధేశ్యామ్’ ఒక్కటే కాదు, రేప్పొద్దున్న రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపైనా నెగెటివిటీ కోసం కొంతమంది గోతికాడ నక్కల్లా కాచుక్కూర్చున్నారు. వాళ్ళ పనే అది.!