Radhika Apte Cinematic Crime.. రాధిక ఆప్టే తెలుసు కదా.? తెలియకుండా ఎలా వుంటుంది.? తెలుగులో నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేసింది కదా.!
సినిమాల్లో నటించి సంపాదించుకున్న గుర్తింపు కంటే, వివాదాస్పద వ్యాఖ్యలతోనే రాదిక ఆప్టే తనదైన స్టైల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది.
వివాదాస్పద వ్యాఖ్యలకు తోడు, రాధిక ఆప్టే ‘అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు’ కూడా, ఆమె పేరు నిత్యం వార్తల్లో వుండేలా చేశాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
తాజాగా ఇంకోస్సారి రాధిక ఆప్టే, తన ట్రేడ్ మార్క్ వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. అదీ, సినిమాల్లో అలానే వెబ్ సిరీస్‌లలో చూపిస్తున్న ‘హింస’ గురించి తెగ ఆవేదన వ్యక్తం చేసేసింది రాధిక.
Radhika Apte Cinematic Crime.. ప్చ్.. హింస పెరిగిపోతోంది జుగుప్సాకరంగా..
‘సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లలోనూ హింసాత్మక సన్నివేశాలు పెరిగిపోతున్నాయి. అవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి..’ అని రాధిక ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
ఇలాంటి సమాజంలో, పిల్లల్ని ఎలా పెంచాలో కూాడా అర్థం కావడంలేదంటూ ఇటీవల తల్లి అయిన రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

ఎవరు, దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసా.? అంటూ, రాధిక ఆప్టే మీద సెటైర్లు పడుతున్నాయి. పడతాయ్ మరి.. ఆమె చేసిన సినిమాలు అలాంటివి.
తెలుసు కదా.. రాధిక ఆప్టే, తెలుగు తెరకు పరిచయమైంది ‘రక్తచరిత్ర’ సినిమాతోనేనని.! ‘రక్తచరిత్ర’ సినిమాలో హింస ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
ఈ మధ్యనే రాధిక నటించిన సినిమా ఒకటి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ‘సిస్టర్ మిడ్‌నైట్ ఆ సినిమా పేరు. అందులో రాధిక ఆప్టే, రంపంతో మనిషి శరీరాన్ని ముక్కలు చేసేస్తుంది.
హింసకి రాధిక డిక్షనరీలో వేరే అర్థం వుందిలేే..
బహుశా ఆయా సినిమాలు చేస్తున్నప్పుడు, హింసకి వేరే అర్థమేమైనా ఆమె చెప్పుకుందో ఏమో.! ఇక, రాధిక సినిమాల్లో వల్గారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

వల్గారిటీ కాదు, అడల్ట్ కంటెంట్ వున్న సినిమాలవి. ‘సిస్టర్ మిడ్‌నైట్’ సినిమాలోనూ ఓ సీన్ అలాంటిదే వుంటుంది.!
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
నీతులు చెప్పడానికే.. ఆచరించడానికి కాదు.! ఏకంగా, పిల్లల్ని ఇలాంటి సమాజంలో ఎలా పెంచడం.? అనేస్తోంది.! మరీ, ఇంత అమాయకత్వమా.?
అమాయకత్వం కాదు, గురివింద నైజం.!
