వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకోవాలని తహతహలాడే కొంతమంది అందాల భామల్లో రాధికా ఆప్టే (Radhika Apte) పేరు ముందు వరుసలోనే వుంటుంది. వీలు చిక్కితే ఏదో ఒక వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చేసి, వార్తల్లోకెక్కడం రాధికా ఆప్టేకి వెన్నతో పెట్టిన విద్య.
కొన్నాళ్ళ క్రితం, ఓ సౌత్ హీరో తనను షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే, ఆ తర్వాత ఆ హీరో ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఎందుకు చెబుతుంది.? అప్పటికే ఆ ఆరోపణతో ఆమెకు దక్కాల్సిన పబ్లిసిటీ దక్కేస్తేనూ.!
Radhika Apte మేకప్పు కహానీ..
ఇక, తాజాగా రాధికా ఆప్టే, ‘మేకప్పు’ గురించి పెద్ద ‘బిల్డప్పు’ ఇచ్చేసింది. ‘సహజమైన అందం గురించి మాట్లాడేవాళ్ళు అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకోకండి..’ అంటూ ఓ ఉచిత సలహా పారేసింది రాధికా ఆప్టే. ఇంతకీ, అలా సర్జరీలు చేయించుకుంటున్నవారిపై రాధికా ఆప్టేకి అంత అసహనమెందుకొచ్చిందో.?

‘నా వరకూ నేను ఎక్కువగా మేకప్‌ని ఇష్టపడను. కానీ, కొన్ని సందర్భాల్లో అది తప్పదు..’ అని సెలవిచ్చింది రాధికా ఆప్టే. అదిరింది కదూ.! ఇలాంటి కవరింగుల్లో రాధికా ఆప్టేకి సాటి ఇంకెవరూ రారేమో.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
సినీ రంగంలో అందాన్ని పెంచుకునేందుకు సర్జరీలనేవి సర్వసాధారణమైపోయాయి. ఆ మాటకొస్తే, గ్లామర్ పెంచే సర్జరీలు ఇప్పుడు సాధారణ ప్రజానీకానికీ విరివిగానే అందుబాటులోకి వచ్చేశాయ్.
ఎవరిష్టం వాళ్ళది. సహజమైన అందం గురించి మాట్లాడితే, సర్జరీలు చేయించుకోకూడదా.? అని కొందరు నోరెళ్ళెబెడుతున్నారు రాధికా ఆప్టే (Radhika Apte) వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ.