Radhika Apte Padding.. ఓ సౌత్ సినిమా షూటింగ్ సందర్భంగా, ‘ప్యాడింగ్’ పేరుతో తనను టార్చర్ చేశారంటూ సినీ నటి రాధిక ఆప్టే సంచలన ఆరోపణలు చేసింది.
రాధిక ఆప్టేకి, ఇలా ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఓ సౌత్ హీరో, తనను ఇబ్బంది పెట్టాడనీ, ‘కమిట్మెంట్’ అడిగాడనీ అప్పట్లో ఆరోపణలు చేసింది రాధిక.
సౌత్‌లో రాధిక ఆప్టే చేసింది కొద్ది సినిమాలే. అందులో కొన్ని తెలుగు సినిమాలూ వున్నాయి. ఓ ప్రముఖ హీరో.. అంటూ, నందమూరి బాలకృష్ణ అని అర్థం వచ్చేలా రాధిక ఆరోపణలు చేసింది.
‘రక్త చరిత్ర’తో పాటు, ‘లెజెండ్’ ‘లయన్’ తదితర సినిమాల్లో రాధిక నటించిన సంగతి తెలిసిందే. ‘లెజెండ్’, ‘లయన్’ బాలయ్య నటించిన సినిమాలే.!
‘ధోనీ’ అనే ఇంకో సినిమాలోనూ రాధిక ఆప్టే నటించింది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యిందీ సినిమా.!
Radhika Apte Padding.. ఎవరా దర్శకుడు.?
ప్యాడింగ్ అంటే తెలుసు కదా.? బ్రెస్ట్ ఎక్కువగా కనిపించడానికీ, అలానే పిరుదులు ఎక్కువగా కనిపించడానికీ.. ఈ ప్యాడింగ్ ఉపయోగిస్తుంటారు.
‘సరిపోలేదు, ఇంకాస్త ప్యాడింగ్ కావాలమ్మా..’ అని, ఓ దర్శకుడు తనను టార్చర్ చేసినట్లు రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించింది.
ఓ దర్శకుడు.. సౌత్ సినిమా.. అని చెప్పడమెందుకు.? ఫలానా దర్శకుడు, ఫలానా హీరో.. అని చెప్పెయ్యొచ్చు కదా.? అంటే, అదే రాధిక ప్రత్యేకత.!
Also Read: అనన్య లెహెంగా ఖరీదు లచ్చ.! చీప్ అండ్ బెస్టేగా.!?
ఇలా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం, వార్తల్లో వుండడం.. రాధిక ఆప్టేకి కొత్తేమీ కాదు.! గ్లామర్ ప్రపంచంలో మేకప్ ఎలాంటిదో, ప్యాడింగ్ కూడా దాదాపు అలాంటిదేనంటారు సినీ జనాలు.
నిజానికి, ఆ ప్యాడింగ్ గురించి పెద్దగా మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటి ప్యాడింగ్ అంశంపై రాధిక, ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?
ప్యాడింగ్ గురించి అంత వేధింపులు నిజంగానే ఎదుర్కొని వుంటే, అప్పుడే వ్యతిరేకించి వుండొచ్చు కదా.?
