Rajamouli Oscars.. ఇప్పుడంటే రాజమౌళి గురించి దేశమంతా మాట్లాడుకుంటోందిగానీ, ఒకప్పుడు ఈ స్థాయిలో.. ఇంతకు మించి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకునేటోళ్ళు సినీ అభిమానులు.
రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తోందంటే చాలు, అందులో హీరో.. హీరోయిన్.. ఎవరన్నది ఎవరికీ అనవసరం. అది ఆర్జీవీ సినిమా అంతే. ఫ్లాపులు, డిజాస్టర్లు రామ్ గోపాల్ వర్మ ఇమేజ్‌ని ఏమాత్రం డ్యామేజ్ చేయలేకపోయాయ్.
ఏ సినిమా ‘రామూ’ నుంచి వచ్చినా, అందులో ఏదో ఒక కొత్తదనం వుంటుందని అప్‌కమింగ్ ఫిలిం మేకర్స్ నమ్మేవాల్ళు.
నమ్మకాన్ని చెడగొట్టుకుని..
కానీ, కాలక్రమంలో రామ్ గోపాల్ వర్మ తన ఇమేజ్‌ని తానే చెడగొట్టుకున్నాడు. సినిమా మేకింగ్ అంటే, హీరోయిన్ల కాళ్ళ మధ్యన కెమెరా పెట్టడమే.. అనుకోవడం మొదలు పెట్టాడు.
అలా, రామ్ గోపాల్ వర్మ తన వెలుగుల్ని కోల్పోయాడు. ఆ తర్వాత పాపులారిటీ కోసం వివాదాల్ని ఆశ్రయించడం ఇంకాస్త ఎక్కువగా చేయడం మొదలెట్టాడు.
వివాదాలంటే రామ్ గోపాల్ వర్మ.. రామ్ గోపాల్ వర్మ అంటే వివాదమై కూర్చుంది.
Rajamouli Oscars.. రాజమౌళికి భద్రతా ముప్పు..
తాజాగా రామ్ గోపాల్ వర్మ, జక్కన్న రాజమౌళికి ఉచిత సలహా ఇచ్చాడు. అదీ భద్రత విషయంలో.
‘భద్రతను పెంచుకోవాలనీ.. లేదంటే తనలాంటి చాలామంది నుంచి రాజమౌళి ప్రాణాలకు ముప్పు వుందనీ’ ఆర్జీవీ సెలవిచ్చాడు.

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మార్మోగిపోతుండడం గురించి ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు ఇది. అయినా, ఆర్జీవీ అంటే గౌరవం తప్ప, జెలసీ ఎవరికి వుంటుంది.. ఆర్జీవీకి తప్ప.!
Also Read: బాలయ్యతో హనీ రోజ్ గ్లాస్ పార్టీ.! ఏంటి కథ.?
తానేదో జోక్ చేశానని రామ్ గోపాల్ వర్మ అనుకోవచ్చుగానీ, ఒకప్పటి ఆయన అభిమానులు మాత్రం, ఏ స్థాయి నుంచి ఎక్కడికి దిగజారిపోయావ్ రామ్ గోపాల్ వర్మా.. అంటున్నారు.
దిగజారడంలో ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని ‘రామూ’ వెతుక్కుంటుంటాడు. ఇందులో కొత్తేముంది. నాలుగు పెగ్గులేసి.. రాజమౌళికి భద్రత విషయమై ఆర్జీవీ ఉచిత సలహా ఇచ్చాడట. అంతా పెగ్గు మహిమ.!