Table of Contents
Rajendra Prasad Sorry.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కి బోల్డంతమంది అభిమానులున్నారు. ఆయన చేసిన సినిమాలు అలాంటివి.!
ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే కాదు, ఆయన చేసిన కొన్ని పాత్రలు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి కూడా. విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్.
‘నట కిరీటి’ అని రాజేంద్ర ప్రసాద్ గురించి చెబుతుంటాం. అంత గొప్ప నటుడు, ఇంత సిల్లీగా ఎలా మారిపోయాడు.? వేదిక ఎక్కితే, బూతులు ఎలా మాట్లాడగలుగుతున్నాడు.?
Rajendra Prasad Sorry.. వయసు పెరిగింది.. బుద్ధి హీనత వచ్చింది..
వయసు మీద పడటంతో, బుద్ధి హీనత వచ్చినట్లుంది రాజేంద్ర ప్రసాద్‌కి.! ఈ మాట సినీ పరిశ్రమలోనే వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా.!
వాస్తవానికి, రాజేంద్ర ప్రసాద్ అంటే సినీ పరిశ్రమలో అందరికీ గౌరవమే. కానీ, ఇప్పుడెందుకు ఆయన, తన పేరుని చెడగొట్టుకునేలా వ్యవహరిస్తున్నట్లు.?
కారణం ఏదైతేనేం, తన స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారు రాజేంద్ర ప్రసాద్. దాంతో, సహజంగానే పలచనైపోతున్నారు క్యారెక్టర్ పరంగా.
మాజీ క్రికెటర్ మీద నోరు పారేసుకుని..
మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద కొన్ని రోజుల క్రితం రాజేంద్ర ప్రసాద్, సరదాగా నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో, రాజేంద్ర ప్రసాద్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
అక్కడితో అయినా, రాజేంద్ర ప్రసాద్ తన నోటిని అదుపులో పెట్టకుని వుంటే బావుండేది. చేసిన తప్పుని ఆయన గుర్తెరగలేదు. ఏదో, సరదాగా అనేశానని అన్నట్లే అనుకున్నారు.
కానీ, డ్యామేజ్ చాలా దారుణంగా జరిగిపోయింది రాజేంద్ర ప్రసాద్‌కి. ఆ విషయం అందరికీ అర్థమైనా, రాజేంద్ర ప్రసాద్‌కే అర్థం కాలేదు.
ఈసారి అలీ బలైపోయాడు..
మరో నటుడు, కమెడియన్ అలీ ఈసారి బలైపోయాడు రాజేంద్ర ప్రసాద్ నోటి దురదకి. రాయడానికి వీల్లేని రీతిలో వున్నాయి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు.
కెమెరాలు వున్నాయనుకోలేదు, కుటుంబ సభ్యుల్లాంటి సినీ ప్రముఖులతో కార్యక్రమం కాబట్టి సరదాగా మాట్లాడేశానని రాజేంద్ర ప్రసాద్ తాజాగా, ఈ ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు.
Also Read: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సమీక్ష: ఆ నరుక్కోవడం జుగుప్సాకరం.!
ఇకపై ఎవర్నయినా ‘రు’ అనే సంబోదిస్తాననీ, ‘డు’ అనే మాట కూడా వాడనని రాజేంద్ర ప్రసాద్, వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.
అంతకు ముందు, ఎవడు ఏమనుకుంటే నాకేంటి.? అని ఇంకో వేదికపై, తన నోటి దురుసుని సమర్థించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఎట్టకేలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
చనువు కొద్దీ, ఒరేయ్ అనొచ్చు. కానీ, బూతులు మాట్లాడితే ఎలా.?