ఇండియాలో మగాళ్ళు మాత్రమే స్మోకింగ్ చేస్తారా.? స్మోకింగ్ కారణంగా క్యాన్సర్ మగాళ్ళకు మాత్రమే వస్తుందా.? ఆడాళ్ళనే స్మోకింగ్ మీద ప్రశ్నిస్తారెందుకన్న ప్రశ్నలో అర్థం ఏమన్నా వుందా.? అసలెందుకీ ప్రశ్నలు.! కాస్త కూల్‌గా (Rakul Preet Singh Smoking) ఆలోచించొచ్చు కదా.!
పాపం, పేరులో వున్న ‘కూల్’, ఆమెలో ఎందుకో ఈ మధ్య కన్పించడంలేదు (Rakul Preet Singh Smoking). పరిచయం అక్కర్లేని పేరది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లోకి వెళ్ళినట్లే వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు రేసులో వెనుకబడిపోయిన రకుల్ ప్రీత్ సింగ్, సినిమాలతో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతూ వస్తోంది.
ఎందుకిలా.? ఆమె ఏరికోరి వివాదాలతో సావాసం చేస్తోందా.? లేదంటే, కొందరు పనిగట్టుకుని రకుల్ ప్రీత్ సింగ్‌ని (Rakul Preet Singh) వివాదాల్లోకి లాగుతున్నారా.?
ఏమోగానీ, రకుల్ (Rakul Preet Singh) పేరు మాత్రం తరచూ వార్తల్లోకెక్కుతుంటుంది. ఎలాగైనా పాపులారిటీ దక్కడమే కదా కావాల్సింది సెలబ్రిటీలకు.. అన్న మాటని రకుల్ ఒప్పుకుంటుందో లేదో మరి.!
ఇంతకీ స్మోకింగ్ సంగతేంటంటే.. Rakul Preet Singh Smoking
‘మన్మథుడు-2’ సినిమా కోసం ఓ సన్నివేశంలో రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్‌తో కన్పించింది. దాంతో, సోషల్ మీడియాలో హేటర్స్ రెచ్చిపోయారు. రకుల్ ప్రీత్ సింగ్ మీద నెగెటివ్ కామెంట్స్ పేల్చేశారు. అత్యంత అసభ్యకరంగా ట్రోలింగ్ కూడా చేసేశారు.
అసలు పనీ పాటా లేనోళ్ళే ఈ హేటర్స్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అలా పనీ పాటా లేనోళ్ళ మాటల్ని పట్టించుకోవడంలో అర్థముందా.? కానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఆ ట్రోలింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ‘మన్మథుడు-2’ ప్రమోషన్ సందర్భంగా ఆ అంశాన్ని ప్రస్తావించింది.
‘సినిమాల్లో హీరో సిగరెట్ కాల్చితే.. తప్పు కానప్పుడు, హీరోయిన్లు సిగరెట్ తప్పెలా అవుతుంది.?’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ లాజిక్ లాగింది. ఆమె ప్రశ్నలో లాజిక్ కరెక్టే. కానీ, హీరో సిగరెట్ కాల్చినా తప్పే.. హీరోయిన్ సిగరెట్ కాల్చినా తప్పే.
హీరోయిన్ వేసుకునే డ్రెస్సుల్ని ఫాలో అయ్యేవాళ్ళున్నారు.. డ్రెస్సింగ్‌ని అనుకరించేవాళ్ళున్నారు. హీరోల విషయంలోనూ ఇంతే. కాబట్టి, హీరో హీరోయిన్లు కొన్ని విషయాల్లో కొంచెం ‘బాధ్యతగా వ్యవహరించాలి’ అనే డిమాండ్ ఎప్పటినుంచో వుంది. దురదృష్టవశాత్తూ ‘క్రియేటివిటీ’ ఆ వాదనల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందనుకోండి.. అది వేరే విషయం.
వివాదాలు రకుల్‌కి కొత్త కాదు..
వివాదాలతో సావాసం చేయడం రకుల్ ప్రీత్ సింగ్‌కి కొత్త కాదు. ఆ మధ్య ఎవరో, రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి డ్రస్ గురించి వల్గర్ కామెంట్ చేస్తే, అంతకన్నా వల్గర్‌గా రిటార్ట్ ఇచ్చింది రకుల్. ఆ వ్యక్తి సభ్యత, సంస్కారం మర్చిపోయాడన్నది నిర్వివాదాంశం.
కానీ, రకుల్ విజ్ఞత ఏమయిపోయింది.? వాడికి నాలుగు చీవాట్లు పెట్టడంలో తప్పు లేదు. కానీ, ఇక్కడ సదరు వ్యక్తి తాలూకు తల్లి గురించి చెత్తగా మాట్లాడి రకుల్ అడ్డంగా బుక్కయ్యింది.
ఏదిఏమైనా, ‘నేను స్మోకింగ్‌కి వ్యతిరేకం.. సినిమాలో ఆ పాత్ర కోసం జస్ట్ అలా నటించానంతే’ (Rakul Preet Singh Smoking) అన్న ఒక్క మాటతో సిగరెట్ వివాదానికి ముగింపు పలకకుండా, హీరోలు సిగరెట్ కాల్చితే తప్పు లేదా? అని క్వశ్చన్ సంధించడం ద్వారా ఆవేశాన్ని బయటపెట్టుకుంది తప్ప, రకుల్ అంతకు మించి తన వివరణతో సాధించిందేమీ లేదు.