Rakul Preet Singh.. సైజ్ జీరో మేనియాతో తిండి తినడం మానేస్తుంటారు అందాల భామలు. ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది.
కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా.. సన్నగా.. రివటలానే కనిపిస్తూ వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఫిట్ అండ్ పెర్ఫెక్ట్.. అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఫిట్నెస్ పాఠాలు చెబుతుందీ భామ.
అన్నం మానేసి.. అందాన్ని తినేస్తున్నావా.? ఈ డౌటానుమానం వచ్చింది చాలామందిక.! ఎందుకో తెలుసా.?
Rakul Preet
ఇంతందం ఎలా సాధ్యం.? అంటే, నచ్చింది తినడం.. ఆపై ఆనందంగా వుండడం.. దానికి తోడుగా తగినంత వ్యాయామం.. అని చెబుతుంటుంది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh.. వైరల్ అవుతున్న ఫొటోలు..
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేస్తోంది. ఆహారమే ఆనందం.. అంటూ యమ్మీ యమ్మీ పోజులిచ్చిందీ బక్క పలచ భామ.

ప్రస్తుతం వరుసగా హిందీలో సినిమాలు చేస్తోన్న రకుల్, సౌత్‌లో సినిమాల్ని కాస్త తగ్గించింది.
కారణమేంటి.? అంటే, ప్రత్యేకమైన కారణం ఏమీ లేదనీ, హిందీలో ఒప్పుకున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తున్నాననీ రకుల్ వివరించింది.
Also Read: Anasuya Bharadwaj: అంతకు మించి.!
ఇంతకీ, ఇంత అందంగా ఎలా వున్నావ్.? అందంగానీ ఎక్కువగా తినేస్తున్నావా ఏంటీ.? అంటూ నెటిజన్లు కామెంట్లేస్తున్నారు. నెటిజన్ల డౌటూ నిజమేనేమో.!
రొటీన్ కమర్షియల్ సినిమాలు బోర్ కొట్టాయేమో.! డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్ని ఎంచుకుంటోంది రకుల్.
ఈ క్రమంలో ‘ఛత్రీవాలీ’ వంటి సినిమాల్ని చేస్తూ నటిగా విమర్శకుల ప్రశంసల్నీ ఈ బ్యూటీ అందుకుంటోంది.