Ram Bhagyashri Borse Gossip.. ఔను, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.! ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు.! ఔను, వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు.! గాసిప్పులంటేనే, ఇలా వుంటాయ్.!
కొన్ని జంటలు వైవాహిక బంధంతో ఒక్కటవుతాయి. కొన్ని జంటలు, కేవలం గాసిప్పుల కాలమ్స్‌లోనే సిన జంటలవుతాయ్.! నిజానికి, ఎవరి దారి వారిదే.!
సినీ జనాలంటే, ఒకింత ఆసక్తి ఎక్కువే వుంటుంది ఎవరికైనా. అందుకే, వారి గురించి ఏ గాసిప్ వచ్చినా, దానికి బోల్డంత క్రేజ్. ఇంతకీ, ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది.?
Ram Bhagyashri Borse Gossip.. కలిసి నటిస్తే.. అంతేనా.?
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా, భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.
భాగ్యశ్రీ పోస్ట్ చేసిన ఫొటో వెనకాల బ్యాక్‌గ్రౌండ్, కొందరికి అనుమానం కలిగించింది. రామ్ పోతినేని కూడా అదే బ్యాక్ గ్రౌండ్‌లో ఫొటో దిగాడంటూ.. రచ్చ మొదలైంది.

ఏముంది.? హీరో, హీరోయిన్.. షూటింగ్ నిమిత్తం వేరే చోటకు వెళ్ళినప్పుడు, ఖరీదైన హోటళ్ళలో బస చేస్తారు.. అక్కడ రూమ్స్ అన్నీ, దాదాపు ఒకేలా వుంటాయ్.
వేర్వేరు రూమ్స్.. వాటి బ్యాక్‌గ్రౌండ్ సేమ్.! ఇదీ అసలు కథ. కానీ, ఇక్కడ ఇంకో విషయం వుంది. అదేంటంటే, రామ్ పోతినేని గెటప్. రామ్ పోతినేని, చాలాకాలం క్రితం తీసుకున్న ఫొటో అది.
Also Read: రేయ్.! ఎవరన్నా ఈ ‘పాప’కి గుడి కట్టెయ్యండ్రా.!
భాగ్యశ్రీ ఫొటో మాత్రం లేటెస్ట్.! అద్గదీ అసలు సంగతి. ఈలోగా, సోషల్ మీడియా హోరెత్తిపోయింది భాగ్యమ్, రామ్.. ఒక్కటవబోతున్నారని.
అన్నట్టు, భాగ్యశ్రీ ఎవరో తెలుసు కదా.? ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ‘అబ్బచ్చా..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బ్యూటీ.