Table of Contents
Ram Charan Rangasthalam.. కొన్ని సినిమాల గురించి మాత్రమే ఏళ్ల తరబడి మాట్లాడుకుంటుంటారు. అలాంటి చాలా కొన్ని సినిమాల్లో ‘రంగస్థలం’ కూడా ఒకటి. ఏళ్ళు గడుస్తున్నాగానీ, ‘రంగస్థలం’ సినిమా గురించిన ప్రస్తావన ఎప్పటికప్పడు వస్తూనే వుంటుంది.!
ఓ కల్పిత కథ.. దానికోసం కాలాన్ని వెనక్కి తిప్పినట్టుగా.. ప్రేక్షకుల్ని ఒకప్పటి కాలంలోకి తీసుకెళ్ళిపోవడమంటే.. అందుకోసం దర్శకుడు చాలా చాలా కష్టపడాలి. నటీనటుల సంగతి సరే సరి.
కమర్షియల్ స్టామినా వున్న హీరో.. మాస్ సినిమాలు చేసినా, స్టైలింగ్ కొట్టొచ్చినట్టు కనబడే రామ్ చరణ్.. చెవిటివాడిలా చిట్టిబాబు పాత్రలో.. అందునా కనీసపాటి చదువు కూడా లేని పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించాల్సి వస్తే.!
Ram Charan Rangasthalam.. నెగెటివిటీని తట్టుకుని..
నిజంగానే రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) రిస్క్ చేశాడు. నిజానికి రిస్క్ చేయడం కాదిది.! దర్శకుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. దర్శకుడూ హీరో మీద నమ్మకంతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు.
సుకుమార్ (Director Sukumar), రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోందన్న ప్రకటన వచ్చినప్పటినుంచీ సినిమా మీద నెగెటివిటీనే.!
సినిమా నిర్మాణం కోసం ఎక్కువ సమయమే పట్టింది. అందుక్కారణం, సినిమా షూటింగ్ కోసం ఎంచుకున్న లొకేషన్స్, అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు.
నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా చాలా ఇబ్బంది పెట్టింది షూటింగ్ సమయంలో.
అన్నీ భరించారు.. సినిమా మీద నిర్మాణంలో వుండగానే వచ్చిన నెగెటివిటీనీ తట్టుకున్నారు.
సినిమా థియేటర్లలోకి వచ్చింది. సినిమా ‘చాలా బావుంది’ అన్న టాక్ రావడానికి ముందే, ‘చెత్త సినిమా’ అంటూ నెగెటివిటీ తీవ్రస్థాయిలో దూసుకొచ్చింది.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా..
ఓ వైపు నెగెటివిటీ, ఇంకోవైపు మౌత్ టాక్.. వెరసి, ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా అసలు హిట్టో.. కాదో.. అన్న సందిగ్ధం చాలామందిలో కనిపించింది.
రోజులు గడుస్తున్నాయ్.. సినిమా మీద అప్పటిదాకా నడిచిన నెగెటివిటీ ఓడిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమంటూ ప్రశంసలు ఆకాశాన్నంటాయ్.!

చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కాకుండా ఇంకెవర్నయినా ఊహించుకోగలమా.? చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ నట విశ్వరూపం కళ్ళముందు ఎప్పుడూ కదలాడుతూనే వుంటుంది సినిమా చూసినవాళ్ళకి.
జగపతిబాబు పోషించిన ‘ప్రెసిడెంట్’ పాత్ర కావొచ్చు, కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి నటన కావొచ్చు, రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయిన తీరు కావొచ్చు.. రంగమ్మత్తగా అనసూయ పాత్ర కావొచ్చు.. దేనికదే ప్రత్యేకం.
Ram Charan Rangasthalam.. కలిసికట్టుగా కొల్లగొట్టారు.!
ప్రకాష్ రాజ్, సీనియర్ నటుడు నరేష్, స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్దే.. ఇలా అందరికీ ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నేళ్ళయినా.. తెలుగు తెరపై ఎన్ని గొప్ప చిత్రాలు వచ్చినా, ‘రంగస్థలం’ చిత్రానికున్న ప్రత్యేకత ఎప్పటికీ అలాగే వుంటుంది.!
Also Read: RRR Ramudu Ram Charan.. ‘రాముడి’పై అప్పుడు వెక్కిరింతలు.. ఇప్పుడు జేజేలు.!
దేవిశ్రీ ప్రసాద్ సంగీతమొక్కటే కాదు, సినిమా కోసం పని చేసిన ఆర్ట్ డిపార్టుమెంట్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్.. ఒకటేమిటి, మాస్టర్ క్లాస్ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు.
అసలు ఇలాంటి సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా.? లేదా.? అన్న అనుమానాల్ని పక్కన పెట్టి, దీన్నొక ‘ప్రైడ్’గా భావించి సినిమా కోసం అవసరానికి మించి ఖర్చు చేసిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ని ఎంతగా అభినందించినా అది తక్కువే అవుతుందేమో.!