ఆ వయసేంటీ.? ఆ మాటలేంటీ.? ఛత్.. మనసుకు వయసుతో పనేంటీ.? వయసు నాలుగు అడుగులు ముందుకేయనీయకపోయినా, మనసు ప్రపంచమంతా తిరిగొచ్చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma Naughty Acts) అలాగే పరుగెడతాడు. తన మనసుని పరుగులు పెట్టిస్తుంటాడు.
వర్మని తిట్టేవారు కొందరు, వర్మలా బతకాలని అతన్ని ఫాలో అయ్యేవాళ్లు ఇంకొందరు. వర్మ ఏం చేసినా, ఆ కిక్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే, దటీజ్ రామ్ గోపాల్ వర్మ.. అనే చర్చ పదే పదే నడుస్తుంటుంది.
మేఘా ఆకాష్ మీద మనసు పారేసుకున్న వర్మ
మేఘా ఆకాష్ కనుక 40 ఏళ్లు ముందు పుట్టి ఉండుంటే, తనకసలు విడాకులే అయ్యేవి కావని వర్మ అన్నాడు. లేటు వయసులో వర్మ మేఘా మీద మనసు పారేసుకున్నాడన్న మాట. తప్పేమీ లేదు. మేఘా ఒప్పుకుంటే వర్మ ట్రై చేయొచ్చు. కానీ, మేఘా ఆ ఛాన్స్ వర్మకి ఇవ్వకపోవచ్చు.
జస్ట్ ఫర్ ఫన్. ఇదొక సినిమా ఫంక్షన్ నేపథ్యంలో వర్మ చేసిన సరదా జబర్దస్త్ కామెడీ స్కిట్.. అనుకోవాలేమో. లేకపోతే, మేఘా ఎంత స్వీట్‌గా, ఎంత క్యూట్‌గా కనిపిస్తే మాత్రం.. ఆమె వల్ల అందరికీ డయాబెటిస్ వచ్చేయడమేంటీ.? ట్విస్ట్ ఏంటంటే, మేఘా ఆకాష్ చాలా బాగుంటుంది కానీ, వర్మ సినిమాలకు సూటవ్వదట. ఆ విషయాన్ని వర్మ స్వయంగా సెలవిచ్చాడు.
అషుతో ఆ యాంగిల్.. వర్మాయణం.. Ram Gopal Varma Naughty Acts
వర్మ సినిమాల్లో హీరోయిన్ల కాళ్ల మధ్యలో కెమెరాలు పెట్టేస్తుంటాడు. అదో సరదా ఆయనకి. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో కూడా అదే ఫాలో అవుతున్నాడు ఈ దర్శకుడు. బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డితో ఇంటర్వ్యూ నేపథ్యంలో మోకాళ్లు, ఆ పై భాగం కనిపించేలా డ్రస్సు వేసుకుని అషు కూర్చొని వుంటే, ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ కింద నుంచి ఆమె కాళ్ల పై భాగం తాలూకు సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించాడు ఈ క్రియేటివ్ దర్శకుడు.
వర్మ చేష్టలను ప్రస్థావించడానికి సిగ్గుపడాలో, ఇంకెలా ఫీలవ్వాలో తెలియని పరిస్థితి. అవును, వర్మ రూటే సెపరేటు. జీవితాన్ని మ్యాగ్జిమమ్ ఎంజాయ్ చేయడం వర్మకి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో. ఎవరేమనుకున్నా, డోంట్ కేర్. దటీజ్ వర్మ.. అన్నట్లు ఆ మధ్య బిగ్‌బాస్ ఫేమ్ అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ సందర్భంగా కూడా వర్మ హాటు చేష్టలు పెను దుమారం రేపిన సంగతి కూడా తెలిసిందే.