Ramcharan Chiranjeevi RRR.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని రామ్ చరణ్ పాత్ర గురించి ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కెమరూన్ ప్రత్యేకంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
‘జక్కన్న’ రాజమౌళి ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు, అందులో రామ్ చరణ్ నటనా ప్రతిభ.. వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు జేమ్స్ కెమరూన్.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అంతర్జాతీయ వేదికలపై దక్కుతున్న ప్రశంసలు.. అవార్డులు, రివార్డులు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Ramcharan Chiranjeevi RRR.. పుత్రోత్సాహం..
తన కుమారుడు నటించిన సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటోంటే.. హాలీవుడ్ ప్రముఖుడు, దర్శక దిగ్గజం జేమ్స్ కెమరూన్ ప్రశంసిస్తోంటే, మెగాస్టార్ చిరంజీవికి పుత్రోత్సాహం వుండదా.?
వుంటుంది.. ఖచ్చితంగా వుండి తీరుతుంది. ‘ఇంతకంటే ఏ తండ్రి అయినా గర్వపడేదేముంటుంది.? ఆస్కార్ కంటే గొప్ప ఘనత ఇది..’ అంటూ చిరంజీవి ట్వీటేశారు జేమ్స్ కెమరూన్ వీడియోతోపాటుగా.
జేమ్స్ కేమరూన్ లాంటి గొప్ప ఫిలిం మేకర్.. రామ్ చరణ్‌ని అభినందిస్తే, చిరంజీవి ‘పుత్రోత్సాహం’ ప్రదర్శించకూడదా.?
Mudra369
అంతే, చిరంజీవి మీద సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన ట్రోలింగ్ షురూ అయ్యింది.
ఆ క్రెడిట్ ఎవరిది.?
నో డౌట్.. సినిమాని అంతర్జాతీయ వేదికలపై ప్రమోట్ చేస్తున్న మన దర్శక దిగ్గజం రాజమౌళిదే ఈ క్రెడిట్ అంతా.
అదే సమయంలో, ‘ఆ ఇద్దరు స్టార్లు లేకపోతే.. అసలు సినిమానే లేదు..’ అని రాజమౌళి స్వయంగా చెప్పాడాయె. ఆ ఇద్దరే రామ్ చరణ్, ఎన్టీయార్.

రామ్ చరణ్ కావొచ్చు, ఎన్టీయార్ కావొచ్చు.. తమకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరమే లేదు.
నిజానికి, రామ్ చరణ్‌ని జేమ్స్ కెమరూన్ అభినందించిన విషయాన్ని మెజార్టీ తెలుగు మీడియా కన్వీనియెంట్‌గా విస్మరించింది.
Also Read: హైపర్ ఆది వాడకం మామూలుగా లేదుగా.!
కారణమేంటి.? బహుశా చరణ్ మీద అక్కసు అయి వుండొచ్చు. ఓ సినీ ప్రముఖుడిగా మెగాస్టార్ చిరంజీవికి, హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కేమరూన్ గొప్పతనమేంటో తెలుసు.
జేమ్స్ కేమరూన్ లాంటి గొప్ప ఫిలిం మేకర్.. రామ్ చరణ్‌ని అభినందిస్తే, ఆ రామ్ చరణ్ తండ్రి అయిన చిరంజీవి ‘పుత్రోత్సాహం’ ప్రదర్శించకుండా ఎలా వుంటారు.?