Rana Daggubati Bheemla Nayak: దగ్గుబాటి రానా మంచి నటుడు. తొలి సినిమా (లీడర్)తోనే అది ప్రూవ్ చేసేసుకున్నాడు. విలక్షణ నటుడు. నో డౌట్. కేవలం హీరోయిజమే కాదు, భళ్లాల దేవుడిలా క్రూరమైన విలనిజాన్నీ ప్రదర్శించగలడు.
చాలా మంది హీరోలతో ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాల్లాంటివి చేశాడు రానా దగ్గుబాటి (Rana Daggubati). కానీ, ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా తనకెంతో ప్రత్యేకం అని అభివర్ణించుకుంటున్నాడు రానా. ఎందుకలా అన్నాడు చెప్మా.?
ఇంతకీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా గురించి రానా ఎందుకలా చెప్పుకొచ్చాడంటే. అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘ఏంటి మీ సార్ గబ్బర్ సింగ్ అంట..’ అనే డైలాగ్‌తో ఆదిలోనే పవన్ ఫ్యాన్స్ మెప్పు పొందేశాడు రానా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.
Rana Daggubati Bheemla Nayak.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క.!
రానా తెలుగుతో పాటు, తమిళ, హిందీ తదితర భాషల్లో పలు రకాల సినిమాలు చేశాడు. రకరకాల హీరోలతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నాడు. ఒక్కో సినిమా ఒక్కో రకం. ఒక్కో హీరో ఒక్కో టైపు. కానీ, అందరిలోనూ పవన్ కళ్యాణ్ హీరోయిజం సమ్‌థింగ్ డిఫరెంట్ అని పేర్కొన్నాడు ఈ భళ్ళాల దేవుడు.
‘ఆయనలో అదో టైపు హీరోయిజాన్నిచూశాను.. ఆయన హీరోయిజంతో ఇన్‌స్పైర్ అయ్యాను.. ‘భీమ్లా నాయక్’ సినిమా తర్వాత కొత్త రానా దగ్గుబాటిని చూస్తారు.. పవన్ కళ్యాణ్ ఇన్‌స్పిరేషన్‌తోనే ఆ మార్పు సాధ్యం కాబోతోంది..’ అని రానా దగ్గుబాటి చెప్పడం, ఎంతగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల ఇన్‌స్పైర్ అయ్యాడో రానా అర్ధం చేసుకోవచ్చు.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా తెరకెక్కింది. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.
పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ (Nithya Menen) హీరోయిన్‌గా నటిస్తోంటే, రానా దగ్గుబాటికి జతగా నటిస్తోంది మరో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon).