Rana Daggubati The Terminator.. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, ‘బాహుబలి’ సినిమాలోని భళ్ళాలదేవ పాత్రలో ఎలా ఒదిగిపోయాడో చూశాం. కానీ, అతనికి ఓ కన్ను సరిగ్గా పనిచేయదంటే నమ్మగలమా.?
అంతే కాదు, రానా దగ్గుబాటి తీవ్రమైన కిడ్నీ సమస్యతోనూ బాధపడ్డాడు. కండలు తిరిగే శరీరం కోసం నానా రకాల కసరత్తులూ చేయాల్సి వస్తుంది.
కంటి సమస్యకీ దానికీ సంబంధం లేదు. కానీ, కిడ్నీ సమస్యతో బాధపడుతూ అదెలా సాధ్యం.?
Rana Daggubati The Terminator.. ది టెర్మినేటర్.. అంటున్నాడు.!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కంటి చూపు సమస్య గురించీ, తాను ఎదుర్కొన్న కిడ్నీ సమస్య గురించీ రానా దగ్గుబాటి (Rana Daggubati) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

‘కంటికి సర్జరీ జరిగింది. కిడ్నీ సమస్యకీ సర్జరీ జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే నేను టెర్మినేటర్‌ని..’ అనేశాడు రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
రానా నాయుడు.. సమ్‌థింగ్ స్పెషల్..
ట్రెండ్ మారింది.. కథలు చెప్పే విధానమూ మారింది. అలా తాను చేసిన ఓ ప్రయోగం ‘రానా నాయుడు’ అంటున్నాడు ఈ యువ నటుడు.
రానా దగ్గుబాటి తన బాబాయ్ వెంకటేష్‌తో కలిసి చేసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). బూతులు తప్ప, అందులో పనికొచ్చే కంటెంట్ ఏమీ లేదు.. అన్న విమర్శలొస్తున్నాయ్.
Also Read: RRR Movie: రామ్‌చరణ్, ఎన్టీయార్.. సైడ్ ఆర్టిస్టులా.?
అయినాగానీ, రానా దగ్గుబాటి (Rana Daggubati) మాత్రం ‘రానా నాయుడు’ (Rana Naidu) వెరీ స్పెషల్.. సమ్‌థింగ్ స్పెషల్ అంటున్నాడు.

‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రమోషన్లలోనే, తాను గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి రానా దగ్గుబాటి ప్రస్తావించాడు.
విదేశాల్లో రానా దగ్గుబాటికి కిడ్నీ సమస్యకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగింది. ‘కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం విదేశాలకు రానా దగ్గుబాటి..’ అంటూ ప్రచారం జరగ్గా, ఆ ప్రచారాన్ని అప్పట్లో రానా (Rana Daggubati) ఖండించాడు.