Rana Naidu Daggubati.. ఫ్యామిలీతో కలిసి ‘రానా నాయుడు’ చూడొద్దంటూ ముందే చెప్పేశారు వెంకటేష్, రానా దగ్గుబాటి.!
కానీ, ‘వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో కదా.? ఫ్యామిలీస్ చూడకుండా ఎలా వుంటారు.? పైగా, బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా దగ్గుబాటి కలిసి నటించారాయె.!
బాబోయ్ జుగుప్స.. బాబోయ్ ఛండాలం.. అంటూ ‘రానా నాయుడు’ చూసినోళ్ళంతా మొత్తుకున్నారు. నానా బూతులూ తిడుతున్నారు.
Rana Naidu Daggubati క్షమాపణ చెప్పిన రానా దగ్గుబాటి..
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ని ద్వేషిస్తున్నవారికి, నానా తిట్లూ తిడుతున్నవారికి రానా దగ్గుబాటి క్షమాపణ చెప్పాడు సోషల్ మీడియా వేదికగా.
అయితే, ‘ఇది ఫ్యామిలీ మొత్తం చూసేది కాదు. వ్యక్తిగతంగా చూడండి. అది కూడా 18 ఏళ్ళు నిండినవారు మాత్రమే..’ అంటూ ‘రానా నాయుడు’ని రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూనే వున్నాడు.
ఓ తండ్రి.. నలుగురు కొడుకుల కథ ఇది.! అందునా, ఓ తండ్రికీ ఓ కొడుక్కీ మధ్య జరిగే సంఘర్షణ. ఈ క్రమంలో తెరపై ప్రదర్శించిన ఛండాలం అంతా ఇంతా కాదు.!
Also Read: Happy Birthday Nani: సహజత్వం.! ఖచ్చితత్వం.!
సరే, వెబ్ సిరీస్ అంటేనే అంత… అనుకోవడానికీ వీల్లేదు. ఏం, ఆ ఛండాలం లేకుండా తీయలేరా.? తీయొచ్చు.. ఇంతలా బరితెగించకుండా, ఒకింత హాట్ స్టఫ్ ఇచ్చినా.. అది వేరే లెవల్‌లో వుండేదేమో.!