Ranveer Singh Show.. పది మందిలో తాను ప్రత్యేకం.. అనిపించుకోవాలంటే, ఏదో కొత్తగా ట్రై చెయ్యాలి.!
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అన్న మాట తరచూ వింటుంటాం. సాధారణంగా మహిళలు చెప్పే మాట ఇది.
కానీ, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్టున్నాడు. ఆగండాగండీ, ఇక్కడ రణ్‌వీర్‌ని అవమానించే ప్రక్రియ ఏమీ లేదు.
చూసుకున్నోడికి చూసుకున్నంత.!
కాకపోతే, గ్లామర్ షో విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్నాడు రణ్‌వీర్ సింగ్. ఏం, అమ్మాయిలే వస్త్ర సన్యాసం చేస్తారా.? నేనూ చెయ్యగలను.. అని నిరూపించేశాడు. అద్గదీ అసలు సంగతి.
గతంలో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, పూర్తిగా వస్త్ర సన్యాసం చేసేసి ఫొటోలకు పోజులిచ్చాడు. అనాచ్ఛాదిత నగ్నదేహాన్ని ఆవిష్కరించాడు.

తాజాగా ఆ లిస్టులో రణ్‌వీర్ సింగ్ చేరిపోయాడు. కండలు తిరిగిన దేహం, రఫ్ లుక్.. అదీ, శరీరం మీద నూలు పోగు లేకుండా ఫొటోలకు పోజులివ్వడం. వారెవ్వా.! చాలా ఎదిగిపోయినవ్ రణ్‌వీరూ.. అనాల్సి వస్తోంది.
ముందే చెప్పుకున్నట్లు, పది మందిలో తాను ప్రత్యేకం.. అని చెప్పకోవడానికి బహుశా రణ్‌వీర్ ప్రయత్నించాడేమో.!
Ranveer Singh Show.. మనిషికీ, జంతువుకీ తేడా ఏంటబ్బా.?
ఇంతకీ, మనుషులకీ.. జంతువులకీ తేడా ఏంటి.? ఔను కదా, అదీ వ్యాలీడ్ ప్రశ్నే మరి.!
జంతువులకి నగగ్న దేహాన్ని కప్పేందుకు కొన్ని ఏర్పాట్లు వుంటాయేమో.. మనుషులకి కప్పుకునేందుకు అవకాశం వున్నా, విప్పుకుని తిరగడం ట్రెండింగ్ అయి ఏడ్చింది.!
Also Read: రాధికా ఆప్టే భర్త ‘వేస్టు’ అట.! ‘కో-ఆపరేట్’ చెయ్యడట.!
తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో వున్నాడట రణ్‌వీర్. అందుకోసమే, దాన్ని ఇలా సింబాలిక్‌గా చూపించే ప్రయత్నం చేశాడట ఈ బాలీవుడ్ హీరో.
అదిరిందయ్యా రణ్‌వీరుడూ.! (Ranveer Singh) కాస్త, అలాగే జనంలోకి కూడా వచ్చేసి చూడు.. ఇంకాస్త కొత్తగా వుంటుంది.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, చూసేవాళ్ళకు కదా, సిగ్గుండాల్సింది.?
ఇంతకీ, భర్త రణ్‌వీర్ సింగ్ వస్త్ర సన్యాసంపై బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే (Deepika Padukone) ఎలా స్పందిస్తుందో.!