Rasha Thadani Tollywood.. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
కృతి శెట్టిని ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు బుచ్చిబాబు సన. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్, దర్శకుడే కాదు.. హీరో పంజా వైష్ణవ్ తేజ్ కూడా తెరంగేట్రం చేశాడు.
అసలు విషయానికొస్తే, రామ్ చరణ్ – బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం హీరోయిన్ పేరు దాదాపుగా ఫైనల్ అయిపోయింది.
Rasha Thadani Tollywood ఎవరీ రషా.?
రషా తదానీ (Rasha Thadani) అనే ముంబై బ్యూటీని తన తాజా చిత్రం కోసం హీరోయిన్‌గా బుచ్చిబాబు సన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా, రషా తదానీ (Rasha Thadani) లుక్ టెస్ట్ జరిగింది. ఈ లుక్ టెస్ట్ కోసం ముంబై నుంచి హైద్రాబాద్‌కి వచ్చి వెళ్ళింది రషా తధానీ.
తొలి సినిమాతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) సరసన రషా తధానీ ఛాన్స్ దక్కించుకున్నట్టేనా.? ఈ విషయమై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

కాగా, రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే, బుచ్చిబాబు సన (Buchibabu Sana) – రామ్ చరణ్ (Man Of Masses Ram Charan) కాంబినేషన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
Also Read: రష్మికకి ఘోర అవమానం.! ఇంతకీ, ఏం జరిగిందక్కడ.?
అన్నట్టు, రషా తదానీ ఎవరో కాదు, బాలీవుడ్ నటి రవీనా టాండన్ గారాల పట్టి. రవీనా టాండన్ (Raveena Tandon) తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రవీనా టాండన్. అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.