Rashi Singh Dupatta Glamour.. ఫ్యాషన్ వరల్డ్‌లో రోజుకో రకం ఫ్యాషన్. తప్పదు ట్రెండ్‌ని ఫాలో చేస్తూ వెళ్లిపోవడమే. కొన్ని కొన్ని సార్లు ట్రెండ్ సెట్ చేయాల్సి వస్తుంది కూడా.
దుప్పట్టా అంటే ఒకప్పుడు మహిళల మాన మర్యాదల్ని కాపాడేలా ధరించడమే. కానీ, ట్రెండీ యుగంలో దుప్పట్టా ఓ స్టైల్. ఎన్ని స్టైల్స్‌లో వేస్తే అంత స్టైలిష్‌గా కనిపించొచ్చు.
అందుకే దుప్పట్టాలో అనేక రకాల డిజైన్లు. డిజైనర్ దుప్పట్టాలు ధరించడమే కాదండోయ్.. ఆ దుప్పట్టాని డిఫరెంట్‌గా ధరించడం కూడా ఓ కళే మరి.
Rashi Singh Dupatta Glamour.. రెక్కలొచ్చిన చక్కని చుక్క..
అందుకే ఈ ముద్దుగుమ్మ దుప్పట్టాని రెక్కల్లా చుట్టేసింది. నిజంగా బ్యూటిఫుల్ కదా. స్టైలింగ్‌కి స్టైలింగ్.. బ్యూటీకి బ్యూటీ.
ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ పేరు రాశీ సింగ్. కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ప్రేమ్ కుమార్, ‘పాంచ్ మినార్’ ఇలా తదితర సినిమాల్లో నటించింది.

కొన్ని కొన్ని వెబ్ సిరీసుల్లోనూ తళుక్కున మెరిసింది రాశీ సింగ్. మంచి పొటెన్షియల్ వున్న నటే. కానీ, సరైన అవకాశాలు దక్కితేనే కదా.. అసలు సిసలు నటి బయటికొచ్చేది.
యాక్టింగ్ సంగతి పక్కన పెడితే.. పాపకి సోషల్ మీడియాలో కూసింత కళా పోషణ ఎక్కువే. అందుకే, తాజాగా ఈ స్టైలిష్ దుప్పట్టా ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయిలా.
ఆరెంజ్ కలర్ దుప్పట్టాలో రాశీ సింగ్ మెరుపులకు ‘రెక్కలొచ్చిన చక్కని చుక్క’, చంద్రుడిలో ముక్క జారిందే నీలా చక్క.. అంటూ మంచి ప్రాసలతో నెటిజన్ల నుంచి క్యూట్ క్యూట్ కామెంట్స్ వస్తున్నాయ్.
