Rashmi Gautam Biggboss Telugu బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ చాలా చాలా చప్పగా సాగింది. ఏడో సీజన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ప్రస్తుతానికైతే ఎవరికీ లేదు.
కానీ, కంటెస్టెంట్స్ ఎవరు.? అన్న అంశంపై బోల్డన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయ్. ప్రతి సారీ ఈ తరహా గాసిప్స్ మామూలే.. ఈసారి ఇంకాస్త గట్టిగా గాలి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయ్.
తాజాగా ఈ లిస్టులోకి రష్మి గౌతమ్ (Rashmi Gautam) పేరు వచ్చి చేరింది. రష్మి పేరు మొదటి సీజన్ నుంచీ వినిపిస్తూనే వుంది.
ఇంతకీ, ఏడో సీజన్ విషయంలో రష్మిని బిగ్ బాస్ (Bigg Boss Telugu) నిర్వాహకులు సంప్రదించారా.? అసలు కథేంటి.?
Rashmi Gautam Biggboss Telugu నో ఛాన్స్ అంటున్న రష్మి..
బిగ్ బాస్ రేటింగ్స్ దారుణంగా పడిపోయిన దరిమిలా, రష్మి కంటెస్టెంట్‌గా వస్తే బావుంటుందనే చర్చ అయితే జరుగుతోందట. అంతే కాదు, రష్మికి ఏకంగా రికార్డు స్థాయి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారని సమాచారమ్.
ఇంతకీ రష్మి మనసులో ఏముంది.?బిగ్ బాస్ (Bigg Boss Telugu) పట్ల రష్మి గౌతమ్ (Rashmi Gautam) అభిప్రాయమేంటి.?
‘నేనా.? బిగ్ బాస్ హౌస్‌లోకా.? నాకు అంత ఓపిక లేదు. కుటుంబ సభ్యుల్ని వదిలేసి వుండలేను. అయినా, ఆ షో నాకు సరిపడదు..’ అంటూ రష్మి తేల్చేసింది.

సో, ఇక్కడితో రష్మి (Rashmi Gautam) బిగ్ బాస్‌లోకి వెళ్ళబోతోందన్న రూమర్స్‌కి చెక్ పడినట్లేనా.? ప్చ్.. అలా అనుకోవడానిక్కూడా వీల్లేదు.
‘నేనా.? బిగ్ బాస్ హౌస్‌లోకా.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించినోళ్ళు, తమపై వచ్చిన గాసిప్స్‌ని ఖండించినోళ్ళూ.. ఆ తర్వాత బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్లుగా ప్రత్యక్షమయ్యారు.
వెళితే రిస్క్ చేసినట్లేనా..
శ్రీముఖికి బిగ్ బాస్ వల్ల ‘జీరో’ ప్రయోజనం.! చిత్రమేంటంటే, బిగ్ బాస్ విన్నర్స్ కూడా ఈ మధ్య తేలిపోతున్నారు. గెలిచినా, వాళ్ళకి ఆ తర్వాత లభిస్తున్న ప్రత్యేక గుర్తింపు ఏమీ వుండట్లేదు.
సో, రష్మి బిగ్ బాస్‌కి వెళ్ళడం అన్నది దాదాపు లేనట్టే. ఇప్పుడు రష్మికి వున్న పాపులారిటీ పోల్చితే, బిగ్ బాస్‌లోకి వెళ్ళి దాన్ని చెడగొట్టుకున్నట్లే అవుతుంది.
Also Read: పనిమనిషిగా వస్తావా.? అనసూయపై ట్రోలింగూ.. ఫైరింగూ.!
తన ఇమేజ్, పాపులారిటీని పణంగా పెట్టి.. బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్ళి.. ఆ పేరుని రష్మి పాడు చేసుకుంటుందా.? ఆ అవకాశమే వుండకపోవచ్చు.