Rashmi Gautam Sanatana Dharmam.. దేశవ్యాప్తంగా సనాతన ధర్మం గురించిన చర్చ జరుగుతోంది.! హిజబ్ ధారణపై జరిగిన చర్చ, విధ్వంసాలకు దారి తీసింది.
అదేంటో, సనాతన ధర్మం గురించి ఓ రాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, అదో పెద్ద విషయమే కాకుండా పోయింది చాలామందికి.!
ఇక, సోషల్ మీడియాలో అయితే, ‘సనాతన ధర్మం అంటే ఇదీ’ అంటూ చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి. ఎవరికి తోచినట్టు వారు ‘సనాతన ధర్మాన్ని’ వక్రీకరించుకుంటూ, ఆ ధర్మాన్ని విమర్శించుకుంటూ పోతున్నారు.!
Rashmi Gautam Sanatana Dharmam.. రష్మి ఎందుకు దిగింది.?
కొన్నాళ్ళ క్రితం సనాతన ధర్మం గురించి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని ఇటీవల బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
అంతే, ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు కొందరు. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ వెళుతోంది రష్మి.
సనాతన ధర్మం గురించి రష్మి తనకు తెలిసింది చెబుతోంది. అట్నుంచి కూడా ఏవేవో అర్థం పర్థం లేని వాదనలు జరుగుతున్నాయి.
ఇదా సనాతన ధర్మం..
ఇంతలో అనూహ్యంగా ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. ఓ సినిమాలో రష్మి గౌతమ్ ఫొటో అది.! మరీ అంత అసభ్యకరంగా ఏమీ లేదుగానీ, గ్లామరస్‌గా వుంది ఆ ఫొటో.
ఇదేనా సనాతన ధర్మమంటే.? సనాతన ధర్మం దీన్ని అనుమతిస్తుందా.? అని ప్రశ్నించాడో నెటిజన్.
అసలు సనాతన ధర్మానికీ, ఓ వ్యక్తి వస్త్రధారణకీ సంబంధమేంటి.? అన్న ఇంగితం కూడా లేకుండాపోయింది ఆ నెటిజన్‌కి.
Also Read: అప్పుడూ.. ఇప్పుడూ.. అదే టమాటా.! కానీ.!?
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయినప్పుడు, ఇలాంటి అర్థం పర్థం లేని చర్చ తెరపైకి తెస్తుంటారు..’ అంటూ రష్మి గౌతమ్ మండిపడింది.
అయినా, సనాతన ధర్మం గురించిన డిస్కషన్ జరుగుతున్నప్పుడు, సినిమాకి సంబందించిన గ్లామరస్ ఫొటో తీసుకు రావడం వెనుక అసలు ఉద్దేశ్యమేంటి.?
ఉద్దేశ్యపూర్వకంగా భారతీయ సనాతన ధర్మంపై ఓ వర్గం దాడి చేస్తోంనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?